ఆమెతో పిల్లలను కనేందుకు నేను సిద్దం..
హాలీవుడ్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ ప్రేమించి పెళ్లి ఇండియాలో అంగరంగ వైభవంగా చేసుకున్న తన భార్య కాటి పెర్రీతో పిల్లలు కనేందుకు తహాతహాలాడుతున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించడం విశేషం. 36 సంవత్సరాల వయసు కలిగిన రస్సెల్ బ్రాండ్‌కి తను గాడ్ ఫాదర్‌గా భావించే స్నేహితుడుకి ట్విన్స్ జన్మించగా, అతను వారిపై ఉన్న ప్రేమను రస్సెల్ బ్రాండ్‌తో పంచుకొవడం మాత్రమే కాకుండా పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఎంజాయ్ చేస్తూ పెంచే అనుభూతని తనతో పంచుకొవడంతో రస్సెల్ కూడా మేము పిల్లలను కని ఆ అనుభూతిని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో పిల్లలను కనేందుకు సిద్దమై పోయాడని సమాచారం.
అంతేకాకుండా టివి హోస్ట్ ఎల్లిన్ డిజినరస్ ఇటీవల ఓ ఇంటర్యూలో మీరు పిల్లలు గురించి ఏమైనా ఆలోచిస్తున్నారో అన్న ప్రశ్నకు గాను, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. వారు చిన్నప్పుడు ముద్దు ముద్దుగా ఉండి చేసే అల్లరి పనులను చాలా బాగా అస్వాదిస్తానని అన్నారు. నాకు, పెర్రీకి కవల పిల్లలు పుట్టాలని దేవుడుని ప్రార్దిస్తున్నానని అన్నారు. మొదట్లో నా స్నేహితుడి కవల పిల్లలను చూసినప్పుడు నాకు చాలా బోర్ అని అనిపించింది.
ఆ తర్వాత వాళ్లు చేసే చిలిపి, అల్లరి పనులు నన్ను మంత్ర ముగ్దుడిని చేశాయని పేర్కోన్నారు. ఆ సందర్బంలో నేను వాళ్లని ఓ సైంటిస్టు మాదిరి చూస్తుండిపోయానని తెలిపారు.


Click it and Unblock the Notifications











