ఏంజలీనా దయార్థ హృదయంతో అందరి మన్ననలూ పొందుతోంది..!!
గత మంగళవారం, బుధవారం హైతీ దేశాన్ని తాకిన భారీ భూకంపం తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఇందులో లక్షలాది నంది ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంటు భవనం, పాఠశాలలు, ఆస్పత్రులు కూడా కూలిపోయాయి. హైతీ అధ్యక్షుడు రేనే ప్రేవాల్ ప్రకటించారు. ఈ భూకంపంలో అధ్యక్షుల వారి భవనం కూడా కూలిపోయి ఆయన కూడా నిరాశ్రయుడు గా మిగిలిపోయారు...ఇలాంటి సమయంలో వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు.
వీరిలో ప్రముఖ హాలీవుడ్ తారలు ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ లు కూడా తమ వంతు ఉడుతా భక్తి సాయంగా మిలియన్ డాలర్లను విరాళంగా అందజేసారు. ఇంతకు ముందు కూడా ఈ జంట కష్టాల్లో వున్న వారిక సయపడి అందరి మన్ననలూ పొందింది. ఇప్పటికే నలుగురు అనాదపిల్లలను చేరదీస్తూ, ఐక్యరాజ్యసమితి శాంతి దూతగా వ్యవహరిస్తున్న ఏంజలీనా అందరికీ ఆదర్శం అనడంలో అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications











