మూగ జీవాల మీద ఉన్న ప్రేమకు 2మిలియన్ డాలర్లు విరాళం
బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ ఇద్దరూ కలసి నమీబియాలోని నాన్ కుషి వైల్డ్ లైఫ్ సాంచురీకి 2మిలియన్ డాలర్లు విరాళం ఇవ్వడం జరిగింది. ఆఫ్రికా దేశాలమీద ఏంజిలినా జోలీకి ఉన్నటువంటి అమితమైన ప్రేమే ఈవిరాళం ఇవ్వడానికి కారణం అంటున్నారు జోలీ. ఇది మాత్రమే కాకుండా 2006లో తన ముద్దుల కూతురు షైలో కుజన్మనిచ్చింది నమీబియా లోనే కావడం విశేషం. అందుకే నమీబియా దేశం అంటే ప్రత్యేకమైన అభిమానం అంటున్నారు జోలీ.
ఇక ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ విషయానికి వస్తే ఇందులో దెబ్బలు తగిలిన జంతువులకు ట్రీట్ మెంట్ ఇచ్చి వాటికింక ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటేనే వాటిని అడవిలోకి వదలిపెడతారన్నారు. అందుకే ఈ వైల్డ్ లైఫ్ సాంచురీకి విరాళాలు ఇవ్వడం జరిగిందన్నారు. నమీబియాలో ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరించడం, వారి యొక్క పనితనం, వర్కు పట్లు వారికున్న నిబద్దత చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుందన్నారు. ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేమన్నారు.


Click it and Unblock the Notifications











