వారిద్దరూ 'పిల్లి-ఎలుక' లా ఎప్పుడూ గొడవపడుతుంటారు..!!
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ, నటుడు బ్రాడ్ పిట్ లు కలసి సపజీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరినీ చూసిన వారెవరైనా వీరి అన్యోన్యతను చూసి ముచ్చటపడతారు. ఆరుగురు పిల్లలను కలసి పెంచుతున్న వీరు అందరికీ ఆదర్శప్రాయం. కానీ బయటకు ఇంత అన్యోన్యంగా కనిపించే వీరు "పిల్లి--ఎలుకలా" ఎప్పుడూ పోట్లాడుకుంటూనే వుంటారని ఏంజలీనా-బ్రాడ్ ల మధ్య గల బంధం గురించి వచ్చిన ఓ పుస్తకం "బ్రాంజిలీనా" లో వెళ్లడించారని యుయస్ మ్యాగ్జయిన్ ఓ వార్తను ప్రచురించింది.
అంతే కాకుండా ఏంజలీనా ఎప్పుడూ షార్ట్ టెంపర్ గా వుంటుందని, కోపం వచ్చినప్పుడు కోడె నాగులా మీదికి దూకి అరుస్తుందని కూడా ఈ వార్తలో ప్రచురించారు. ఈ వార్తా కథనం ప్రకారం "జోలీ, పిట్ ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూ వుంటారు. ముఖ్యంగా వీరిద్దరూ వీరి ఆరుగురు పిల్లల విషయంలో గొడవపడుతూ వుంటారు. పిల్లల బొమ్మలు ఎక్కడ పెట్టాలి, పిల్లలని ఎలా పెంచాలి, ఎవరు ఇంటిని శుభ్రం చెయ్యాలని అనే ఈ మూడు కారణాలు ఎల్లప్పుడూ వీరి గొడవకు కారణం" అట.. ఇది చాలదన్నట్టు జోలీ సిరియా నుండీ ఓ పాపను దత్తత తీసుకోవాలని ప్రయత్నిస్తోంది, కానీ బ్రాడ్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నాడు. కానీ జోలీ మాత్రం తన ప్రయత్నాలని ముమ్మరం చేస్తోందే కానీ ఆపడం లేదు. చూస్తుంటే వీరిద్దరి విషయం ఎంత వరకూ పోనుందో అని ఆసక్తిని కలిగిస్తోంది కదూ....!!


Click it and Unblock the Notifications











