మనిషి మాత్రమే కాదు ఆమె మనస్సు కూడా చాలా అందంగా వుంటుంది..!!
హాలీవుడ్ హాట్ కపుల్ ఎంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ ల ఔదార్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి ముగ్గురు పిల్లలతో పాటు మరో ముగ్గురు పిల్లలని దత్తతకు తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఇప్పుడు వీరిద్దరికీ జోర్డాన్ లో రహస్య కుటుంబం ఉందనే వార్త ఒకటి బయటకు వచ్చింది. వీరిద్దరూ గత నెలలో జోర్డాన్ లోని SOS పిల్లల సంరక్షణా కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఓ పిల్లాడిని దత్తత తీసుకోనున్నారనే వార్తులు వచ్చాయి. కానీ వీరలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిసింది.
స్థానిక SOS అధికారి చెప్పిన వివరాల ప్రకారం ఈ జంట SOS సంరక్షణా కేంద్రం నుండీ ఏడుగురు పిల్లలను దత్తతకు తీసుకొని, రహస్యంగా వారిని పోషిస్తున్నారని తెలిసింది. కాగా త్వరలోనే ఈ ఏడుగురు పిల్లలూ వుండేందుకు జోలీ జంట త్వరలోనే ఓ భవంతిని కొనుగోలు చెయ్యనుందని తెలిసింది. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబసిడర్ గా వ్యవహరిస్తున్న జోలీ మనిషి మాత్రమే కాదు ఆమె మనస్సు కూడా చాలా అందంగా వుంటుందని సదురు ఉద్యోగి అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











