బ్రిటన్‌లో తక్కువ స్దాయిలో సూపర్ స్టార్ పెళ్లి ప్రయత్నం
లండన్, జూన్ 26: హాలీవుడ్ సెలబ్రిటీ జటం బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ త్వరలో ఒక ఇంటి వారు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఇటీవల లండన్‌లో కొత్తగా కొనుగోలు చేసిన లగ్జరియస్ మాన్షన్‌లో నివసిస్తున్నారు. దక్షిణి ఫ్రాన్స్‌లో ఉన్న లగ్జరియస్ మిరవల్ ఎస్టేట్‌లో హాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. దీంతో లండన్ నుండి అక్కడికి వెళ్లడానికి ముందు ఇక్కడున్న విండ్సర్ తక్కువ స్దాయిలో వేడుకను నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
విండ్సర్ రిజస్టర్ ఆఫీసులో గతంలో ప్రముఖ సెలబ్రిటీలు ఛార్లెస్, కామిల్లా తో పాటు ఎల్టాన్ జాన్, డేవిడ్ ఫర్నీష్ లాంటి జంటలు ఒక్కటయ్యాయి. వీరి పెళ్లి అనంతరం అధికారిక పార్టీని పిట్, జోలీల పిల్లలు, ఫ్యామిలీ సమక్షంలో జరుపుకోనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. బ్రాడ్ పిట్ 'ది కౌన్సిలర్' అనే సినిమాలో నటిస్తుండగా.. ఏంజిలీనా జోలీ 'మేల్ ఫీసియంట్' సినిమాలో నటిస్తున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన తారీఖుని ఇంకా నిర్ణయించ లేదు. గత ఏడు సంవత్సరాలుగా పిట్, జోలీ కలిసి సహాజీవనం సాగిస్తున్నప్పటికీ.. గత ఏప్రిల్‌లో వీరికి ఎంగేజ్‌మెంట్ అయింది.
బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు.
గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు. పిట్, జోలీలు 2004లో మిష్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటికే పిట్‌కు జెన్నిఫర్ అనిస్టన్‌తో వివాహమైంది. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











