పిల్లలతో పారిస్ షాపింగ్ చాలా ఆనందంగా ఉందంటున్న సూపర్ స్టార్..
ఏంజిలీనా జోలి మరియు బ్రాడ్ పిట్ ఇద్దరూ కలిసి పారిస్ నగరంలో షాపింగ్ చేసి యావత్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈషాపింగ్ స్పెషాలిటీ ఏమిటంటే వీరిద్దరితో పాటు వీరి పిల్లలు జహారా మరియు షైలా కూడా వీరితో పాటు షాపింగ్ చేశారు. పారిస్ లోని లక్సంబర్గ్ గార్డెన్స్ కిదగ్గరలో ఉన్నటువంటి బోన్ పాయింట్ అంగడిలో ప్యాంట్స్, గ్లోవ్స్, స్వెట్టర్స్, బూట్స్ లాంటివి కోనుగోలు చేశారు. ఈసందర్బంగా స్టోర్ కిసంబంధించినటువంటి ఉద్యోగులు మాట్లాడుతూ ఏంజిలీనా చాలా గ్రేట్, ఎందుకంటే తను చాలా ఓపికగా తమ పిల్లలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులను అమ్మగా కోనుగోలు చేసింది.
ఏంజిలీనా జోలికి బ్రాడ్ పిట్ బాగా సహారిస్తూ ఇద్దరూ వారికి కావాల్సినటువంటి వస్తువులను కోనుగోలు చేయడం మాత్రమే కాకుండా షాపులో ఉన్నటువంటి అందరు ఉద్యోగులతో చాలా చక్కగా తనదైన శైలిలో పలకరించారు. ప్రస్తుతం వారు పారిస్ కురావడానికి కారణం బ్రాడ్ పిట్ నటించినటువంటి మెగా మైండ్ అనే సినిమా త్వరలోనే ప్రపంచం మొత్తం విడుదలకాబోతున్న సందర్బంగా సినిమా ప్రమోషన్ లోపారిస్ కువచ్చారు. అంతేకాకుండా ఏంజిలీనా జోలి ది టూరిస్ట్ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో బోన్ పాయింట్ అంగడిలో హాలీవుడ్ సెలబ్రిటీలు సాల్మాహాయక్, జెస్సికా ఆల్బా, మిచెల్లీ ఒబామా కూడా షాపింగ్ చేసిన విషయం కూడా తెలిసిందే.
ఇలా దాదాపుగా ఓ గంటసేపు షాపింగ్ చేసిన బ్రాడ్ పిట్ మరయు ఏంజిలీనా జోలి పిల్లలు షైలో ప్యాంట్స్ మరియు జిబ్రా కలర్ కుసంబంధించినటువంటి బూట్స్ ను, అదేవిధంగా జహారా కూడా బ్లాక్ బూట్స్ మరియు డచస్ డ్రస్స్ కోనుగోలు చేయడం జరిగిందని షాపు ఉదోగులు వివరించారు. బోన్ పాయింట్ అంగడిలో పిల్లలకు సంబంధించి ఓరూమ్ లోఅన్ని రకాలైనటువంటి వస్తువులు ఉంచడం జరుగుతుందంట. ఈరూమ్ లోకి వెళ్శినటువంటి జహారా మరియు షైలో ఇద్దరూ చాలా సేపు ఆడలాడుకుంటుండుగా ఏంజిలీనా జోలి వాళ్శ పోటోలు తీస్తూ ఆనందించారని సమాచారం.


Click it and Unblock the Notifications











