వారిద్దరి సహజీవనానికి ఐదేళ్లు నిండాయు...!!
ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ కలసి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలసి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విశేషాన్ని వారిద్దరూ కలసి సెలబ్రేట్ చేసుకున్నారట. లాస్ ఏంజిల్స్ లోని ఛతెవో మార్మోంట్ లో వీరిద్దరూ కలసి ఈ వేడుకను జరుపుకున్నారట. సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడి చేరుకున్న వీరిద్దరూ ఎంతో ఆనందంగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నడుస్తూ వచ్చారు.
కాగా ఇటీవల వీరిద్దరూ విడిపోనున్నారనే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. వీరిద్దరి సహజీవనాన్ని అధ్యయనం చేసి ప్రముఖ రచయిత లాన్ హాల్పెరిన్ 'బ్రాంజెలీనా' అనే పుస్తకంలో బ్రాడ్, జోలీ లు ఎప్పుడూ గొడవ పడుతూ వుంటారని, ప్రతి చిన్న విషయానికీ జోలీ చాలా ఎక్కువగా స్పందిస్తుందని దీంతో గొడవలు వస్తుంటాయని రాసారు. అంతే కాదు కోపం వచ్చినప్పుడు జోలీ త్రాచు పాములా ఎగిరిపడుతుందని, బ్రాడ్ ను ఒంటరిగా వదలడానికి ఇష్టపడదని దీంతో వీరి గొడవలు తారా స్థాయికి చేరి విడిపోవడం వరకూ వచ్చాయని, మరో 18 నెలల్లో విడిపోనున్నారని పేర్కొన్నారు.
కానీ తమ బంధానికి ఐదేళ్లను నిండిన కార్యక్రమాన్ని వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలసి జరుపుకోవడాన్ని చూసిన వారంతా జంట అన్నాకా గొడవలు పడటం సహజమే, వారిద్దరూ విడిపోరనే అనుకుంటున్నాం అని తెలిపారు.


Click it and Unblock the Notifications











