పైలెట్ పాఠాలు నేర్చుకుంటున్న సూపర్ స్టార్ తనయుడు
హాలీవుడ్ అందమైన జంట బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ ముద్దుల కుమారుడు 'మేడాక్స్' పైలట్ పాఠాలు నేర్చుకుంటున్నాడని సమాచారం. బ్రాడ్‌పిట్, ఏంజిలీనా జోలీలకు పుట్టిన బిడ్డలు ఐదు సంవత్సరాల 'షైలో' మరియు మూడు సంవత్సరాల వయసు కలిగిన కవలలు నాక్స్, వివియన్నే. వీరితో పాటు బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ పది సంవత్సరాల వయసు కలిగిన మేడాక్స్, ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన పాక్స్‌తో పాటుగా.. ఆరు సంవత్సరాల వయసు కలిగిన జహారాని దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే.
దీనితో పాటు వీరిద్దరూ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా విపత్తులు సంభవిస్తే తమవంతు సహాయంగా విరాళాలు ఇస్తుంటారు. బ్రాడ్‌పిట్, ఏంజిలీనా జోలీ పిల్లలుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ చిన్న సంఘటనను చూస్తే తెలుస్తుంది. ఇటీవల బ్రాడ్ పిట్ ఒంటరిగా సిగరెట్స్ త్రాగుతుండగా తన కిడ్స్ చూసి , త్రాగడం మంచిది కాదునాన్న అని అనగా తన కిడ్స్ కొసం పొగ త్రాగేటటువంటి అలవాటు ఉన్న బ్రాడ్ పిట్ ఒక్కసారిగా మానివేశాడని సమాచారం.
వివరాల్లోకి వెళితే బుధాపెస్ట్‌లో ఉన్న ఈ డ్రీమ్ హౌస్ గార్డెన్‌లో సరదాగా, బ్రాడ్ పిట్ సిగరెట్ త్రాగుతుండగా బ్రాడ్ పిట్ కిడ్స్ జహారా(6 సంవత్సరాలు), షిల్లా(5 సంవత్సరాలు) చూడడం జరిగింది. దాంతో ఇద్దరూ బ్రాడ్ పిట్ వద్దకు వెళ్లి నాన్న పొగత్రాగడం నీ ఆరోగ్యానికి మంచిది కాదని సలహా ఇచ్చారంట. దాంతో బ్రాడ్ పిట్ తన కిడ్స్ చెప్పిన మాటలకు ఏకీభవిస్తూ నేను పొగ త్రాగడం మానివేస్తున్నానని అన్నారంట.


Click it and Unblock the Notifications











