ఆ స్టార్ జంట సంసారజీవితం పై పుస్తకం విడుదల...!!
హాలీవుడ్ స్టార్ జంట ఎంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ ల సంసార జీవితం మీద ప్రముఖ రచయిత లాన్ హాల్పెరిన్ రాసిన పుస్తకం బ్రాంజిలీనా రేపు (డిసెంబరు 1న) విడుదల కానుంది. ఈ జంటను ఐదేళ్ల పాటు అధ్యయనం చేసిన హాల్పెరిన్ రాసిన ఈ పుస్తకంలో వారు కలసి కలుసుకున్నప్పటి నుండీ వారి జీవిత ప్రస్థానం ఏవిధంగా సాగిందో వివరించినట్టు తెలిసింది.
కాగా ఈ జంట ఈ మధ్య తరచుగా గొడవ పడుతున్నారని, త్వరలోనే విడిపోనున్నారని హాల్పెరిన్ ప్రకటించడంతో ఈ పుస్తకం మీద అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. వారిద్దరూ కలసిన తొలిరోజుల్లో వీరివురూ రోజుకు 18 నుండీ 20 గంటల పాటు పడకగదిలో గడిపేవారని చెప్పి, వారి రొమాంటిక్ లైఫ్ మీద దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ముందున్నంత సాన్నిహిత్యం లేదని, అది రోజురోజుకి తగ్గిపోతోందని ఆయన తెలిపారు. అంతే కాదు ఏంజలీనా చాలా పొసెసివ్ అని, బ్రాడ్ ను ఒక్కడినే బయటకు వెళ్లనివ్వదని, ఎక్కడికెళ్లినా తనతో వుండాలని కోరుకుంటుందని తెలిపారు.
ఇంకా వీరిద్దరి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా....?? ఏముంది ఈ పుస్తకం రేపు విడుదల కానుంది.. ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











