మళ్లీ కలిసి నటించేందుకు సిద్దం: సూపర్ స్టార్
హాలీవుడ్ ఆదర్శ జంట బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలి మళ్లీ తెరపై కలసి నటించనున్నారు. 2005వ సంవత్సరంలో 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' సినిమాలో తెరపై వీరిద్దరూ చోటుని పంచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హాలీవుడ్ బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన 84వ అంతర్జాతీయ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో రెడ్ కార్పెట్‌పై బ్రాడ్‌పిట్, ఏంజిలీనా మళ్లీ కలసి నటించాలనే నిర్ణయాన్ని తెలిపినట్లు ప్రముఖ వెబ్‌సైట్ షోబిజ్‌స్పై రాసింది.
రెడ్ కార్పెట్‌పై 36 సంవత్సరాల వయసు కలిగిన ఏంజిలీనా జోలి మాట్లాడుతూ మేమిద్దరం కలసి మళ్లీ నటించాలని అనుకున్న మాట వాస్తవమేనని అన్నారు. ఐతే 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' సినిమా మాదిరి ఇది రొమాంటిక్ కామెడీ తరహాలో ఉండదని అన్నారు. ఆ సినిమాలో మేమిద్దరం చాలా ఫన్నీగా ఉన్నమాట నిజం. నిజ జీవితంలో అటువంటి జంటను మనం చూడలేం. కేవలం సినిమాలలో మాత్రమే చూస్తామని అన్నారు.
ఇక ఇటీవల ఏంజిలీనా జోలి దర్శకత్వం వహించిన 'ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హానీ' సినిమా ప్రీమియర్ పూర్తి అయిన తర్వాత జోలీ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సినిమాని మీతో షేర్ చేసుకోవడానికి గల కారణం ప్రపంచం నాతో ఉందని అన్నారు. అంతేకాకుండా నా జీవితంలో ఓ రాత్రి లోతుగా కదిలే ఆలోచలనతో కూడుకోని ఉందని నాకే తెలియదని అన్నారు. ఆ తర్వాత ఇంటర్యూలో జోలీ అంతక ముందు రోజు తాను పిట్‌తో కూర్చోని ఈ సినిమా గురించి ఆలోచిస్తున్న సందర్బంలో పిట్ నా చేయిని గట్టిగా పట్టుకోగా.. నేను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు.
ఇక ఈ సినిమా కధ విషయానికి వస్తే బాస్నియన్ యుద్ధం నేపథ్యానికి సంబంధించినది. బాస్నియన్ సెర్బియా సైనికుడు గోరన్ తన మాజీ ప్రేయసి అజ్లా సైనిక జైలు శిబిరంలో ఒక నిర్బంధిగా ఉంటే తనని ఎలా రక్షించుకుంటాడో ముఖ్య కధాంశంగా సాగుతుందన్నారు.


Click it and Unblock the Notifications











