కరేబియన్ అమ్మాయిని దత్తతు తీసుకోవడానికి రంగం సిద్దం: సూపర్ స్టార్
హాలీవుడ్‌లో చాలా మంచి మనసు కల జంట అంటే ఠక్కున మన నోటిలోంచి వచ్చే మాట ఏంజిలీనా జోలి, బ్రాడ్ పిట్. వీరికి మళ్శే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిదని పలు సందర్బాలలో నిరూపించుకున్నారు. ఏంజిలీనా జోలి, బ్రాడ్ పిట్ లు మాడక్స్ వయసు(10), పాక్స్ తైన్ వయసు(7), జహారా వయసు(6), షిల్లా వయసు(4) మాత్రమే కాకుండా కవల పిల్లలు అయినటువంటి నాక్స్, వివిన్నీ లకు తల్లి దండ్రులుగా ఉంటున్నారు. ఇప్పుడు వీరి పిల్లల జాబితాలోకి మరో కొత్త బేబి రోబోతుంది. ఇంతకీ ఎవరా ఆబేబి అని అనుకుంటున్నారా నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి కరేబియన్ దేశానికి చెందినటువంటి లీ అనే చిన్న పాప.
గత సంవత్సరం ఫిబ్రవరిలో ఏంజిలీనా జోలి ఐక్యరాజ్యసమితి బ్రాండ్ అంబాసిడర్‌గా హైతిలో జరిగినటువంటి భూకంప భాదితులను పరామర్శించడానికి వెళ్శిన విషయం తెలిసిందే. అక్కడ తన ఫ్యామిలీ మొత్తాన్ని భూకంప సమయంలో కోల్పోయి దిక్కుతోచనటువంటి పరిస్దితిలో ఉన్నటువంటి లీ ని చూసిన ఏంజిలీనా జోలి తనని దత్తతు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అక్కడున్నటువంటి గవర్నమెంట్ అఫీసియల్స్‌ని, ఛారిటీ సంస్దలను సంప్రదించారు.
ఇది మాత్రమే కాకుండా లీ ని అమెరికాకి తీసుకోనివెళ్శడానికి కావాల్సినటువంటి అన్ని ప్రోసిజర్స్‌ను తన లాయర్ల ద్వారా ఏంజిలీనా జోలి పూర్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా లీ ని కొన్నిరోజులు పాటు ఏంజిలీనా జోలి సంరక్షణలో ఉంచడం మాత్రమే కాకుండా అక్కడి వాతావరణానికి లీ అలవాటు పడితే శాశ్వతంగా లీ ని ఏంజిలీనా జోలి వద్ద ఉంచడం జరుగుతుందని హైతీ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఒకవేళ ఏమైనా కారణాలు వల్ల లీ కనుక అక్కడ ఇమడలేని పరిస్దితి ఉన్నట్లైతే తనని తిరిగి హైతీకి పంపించవసిందిగా అక్కడ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏది అయితేనేం ఏంజిలీనా జోలి ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా చేయాలని కోరుకుందాం..


Click it and Unblock the Notifications











