బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహం ఎక్కడ..!
లండన్: హాలీవుడ్‌లో ఇప్పుడు అందరి కళ్లు ఆ జంట పైనే ఉన్నాయి. ఇంతకీ ఎవరా జంట అని అనుకుంటున్నారా..? ఇటీవలే నిశ్చితార్ధం అయినటువంటి హాలీవుడ్ సూపర్ స్టార్స్ ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్. వీరి నిశ్చితార్దం ప్రయివేటుగా జరిగినప్పటికీ.. పెళ్లి మాత్రం అత్యంత ఘనంగా చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం ఎక్కడ జరగనుందా అంటూ అభిమానులు సమాలోచనలు ప్రారంభించారు. అందరూ అనుకుంటున్నట్లే వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు.
గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు. గత ఏడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ శనివారం నిశ్చితార్దం జరిగినట్లు అధికారకంగా వెల్లడించారు.
ఈ సందర్బంలో పిట్ అధికార ప్రతినిధి సింతియా పెట్-దంతే మాట్లాడుతూ 'అవును అది నిజమే. భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ నిర్ణయం పట్ల వారి పిల్లలంతా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతానికి వారి పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు' అని ఆమె తెలిపారు. పెళ్లి కోసం బ్రాడ్ 2.50 లక్షల డాలర్ల విలువైన వజ్రపుటుంగరం చేయించినట్లు బెవర్లీ హిల్స్ జ్యూయలర్ రాబర్ట్ ప్రొకాప్ వెల్లడించారు. లాస్‌ఏంజెల్స్ కౌంటీ మ్యూజియంలో ఇటీవల జరిగిన చైనీస్ ఆర్ట్ కలెక్షన్ కార్యక్రమంలో తొలిసారిగా జోలీ ఆ ఉంగరంతో కనిపించారు.
పిట్, జోలీలు 2004లో మిష్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటికే పిట్‌కు జెన్నిఫర్ అనిస్టన్‌తో వివాహమైంది. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











