»   » సెక్స్ సినిమాలు వదిలేసా, ఏ అమ్మాయి జీవితం నాలా కాకూడదు!

సెక్స్ సినిమాలు వదిలేసా, ఏ అమ్మాయి జీవితం నాలా కాకూడదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: ఒకప్పుడు అశ్లీల సెక్స్ సినిమాల్లో నటించిన ఆ హీరోయిన్ తర్వాత అదో మురికి కూపం అని తెలుసుకుంది. అలాంటి సినిమాల్లో నటించడం వల్ల సమాజంలో చీదరింపులు, గౌరవ ప్రదమైన జీవితం లేక పోవడం, ఎక్కడికెళ్లినా రోత పుట్టించే మాటలు ఎదురు కావడం.... దీంతో అలాంటి సినిమాలు చేస్తూ బ్రతకడం కంటే...ఆ సినిమాలు వదిలేయడమే మంచిదని నిర్ణయించుకుంది. 2011లోనే ఆ రంగం నుండి బయటకు వచ్చింది. ఆమె ఎవరో కాదు మాజీ పోర్న్ స్టార్ బ్రీ ఓల్సాన్.

అయితే అశ్లీల రంగాన్ని వదిలేసిన తర్వాత తన జీవితం బావుంటుందని, సమాజంలో తన పట్ల ఉన్న అభిప్రాయం మారుతుందని భావించింది బ్రీ ఓల్సాన్. కానీ అలా జరుగలేదని, ఇప్పటికీ తనకు చీదరింపులు, రోత మాటలు ఎదురవుతున్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది బ్రీ ఓల్సాన్.

Bree Olson about adult film industry

అశ్లీల చిత్రాల్లో నటించడం ఓ మురికికూపం లాంటిది, ఏ అమ్మాయి కూడా అటువైపు వెళ్లొద్దు, ఏ అమ్మాయి జీవితం తనలా కాకూడదు అని బ్రీ ఓల్సాన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అశ్లీల చిత్రాల రంగం నుండి తాను బయటకు వచ్చినప్పటికీ తనపట్ల ఇంకా అదే భావన ఉందని, కొందరు తనను అసభ్య పదజాలంతో పలకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ రంగాన్ని వదిలేసిన తర్వాత చాలా వ్యాపారాలు చేసాను, ఏవీ కలిసిరాలేదు, తాను ఏం చేసినా గత జీవితం నన్ను వెంటాడుతోంది. ఈ సమాజం ఇంకా నన్ను అసహ్యించుకుంటోందని కన్నీరు పెట్టారు. ప్రస్తుతం బ్రీ ఓల్సాన్ కెమెరా మోడల్ గా పని చేస్తున్నారు. నా జీవితంలా ఏ అమ్మాయి జీవితం కావొద్దని కోరుకుంటోంది బ్రీ ఓల్సాన్.

English summary
Former adult film star Bree Olson has a message for young girls: Don't get into porn. Olson was one of Charlie Sheen's live-in "goddesses" who shared his home with other women during his 2011 meltdown.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu