First Blood యాక్టర్ కన్నుమూత.. విషాదంలో సిల్వెస్టర్ స్టాలెన్

అత్యంత ప్రజాదరణ పొందిన ఫస్ట్‌బ్లడ్, కిల్లర్, సిల్వరాడో చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించిన బ్రియాన్ డెన్నెహీ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అమెరికాలోని కనెక్టికట్‌లోని న్యూ హావెన్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో సిల్వెస్టర్ స్టాలెన్‌తోపాటు హాలీవుడ్ అగ్రనటులంతా తీవ్ర దిగ్రాంతికి లోనయ్యారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అంటూ సంతాపం వ్యక్తం చేశారు.

బ్రియాన్ డెన్నెహీ వయసు 81 సంవత్సరాలు. ఆయన క్యాస్టూమ్ డిజైనర్ జన్నిఫర్ ఆర్నాట్‌ను రెండో వివాహం చేసుకొన్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే బ్రియాన్‌కు తొలిభార్య జుడిత్ స్కెఫ్ ద్వారా మరో ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు.

 Brian Dennehy no more: Sylvester Stallone wrote in tributes

బుధవారం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించారని బంధువులు మీడియాకు తెలిపారు.

బ్రియాన్ డెన్నెహీ సెమీ టఫ్ అనే చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ సినిమాకు ప్రతీ వారానికి పదివేల డాలర్లు చొప్పున పది వారాలు పనిచేశారు అని సన్నిహితులు చెప్పుకొంటారు.

తన కెరీర్ మొత్తంలో పోషించిన అద్భుతమైన పాత్రలకు గాను.. ఆయనకు రెండు టోని అవార్డులు, ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఓ లారెన్స్ ఓలివర్ అవార్డును సొంతం చేసుకొన్నారు. అలాగే ఆరుసార్లు ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఆయనను 2010లో అమెరికన్ థియేటర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు.

బ్రియాన్ డెన్నెహీ మృతిపై ప్రముఖ హాలీవుడ్ నటుడు స్విల్వెస్టర్ స్టాలోన్ స్పందిస్తూ.. గొప్ప నటుడు బ్రియాన్ డెన్నెహీ మరణించారు. ఆయన ఓ గొప్ప పెర్ఫార్మర్. అతను వియత్నాంకు చెందిన వారైనప్పటికీ.. రాంబో క్యారెక్టర్ కోసం నాకు శారీరక వృద్దిలో సహకారం అందించిన విషయం మరువలేనిది. ప్రపంచ సినిమా ఓ గొప్ప నటుడిని కోల్పోయింది. ఫస్ట్ బ్లడ్ అని సిల్వెస్టర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X