For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఈ రంగానికి రావడానికి ఆదర్శం వారిద్దరే..!

    By Nageswara Rao
    |

    లండన్, జూన్ 6: ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్‌గా, హాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకున్న కెల్లీ బ్రూక్ తాను ఈ ఫ్యాషన్ ప్రపంచానికి రావడానికి గాను కారణం ఫ్రెంచ్ మోడల్ 'బ్రిగిట్టే బార్‌డాట్' అని కొనియాడారు. 'బ్రిగిట్టే బార్‌డాట్' అందమైన షేపులతో ఆరోజుల్లో యువతని ఉర్రూతలూగించారు. 32 సంవత్సరాల వయసు కలిగిన కెల్లీ బ్రూక్ ఫ్యాషన్ ప్రపంచాన్ని తన అభిమానులకు మరింత దగ్గరకు చేర్చాలనే ఉద్దేశ్యంతో ఫ్యాషన్ పోర్టల్‌ని ప్రారంభించింది.


    ఈ ఫ్యాషన్ పోర్టల్‌లో ఉన్న దుస్తులు ఎవరైతే అందమైన షేపుని కలిగి ఉన్నారో వారికి తప్పుకుండా నప్పుతాయని అన్నారు. ఈ పోర్టల్‌ని ప్రారంభించిన తర్వాత కెల్లీ మాట్లాడుతూ నేను ఈ ఫ్యాషన్ రంగానికి రావడానికి ప్రేరణగా ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్స్ బ్రిగిట్టే బార్‌డాట్, సోఫియా లోరెన్‌లు నిలిచారని పేర్కొన్నారు. నాకు బ్రిగిట్టే బార్‌డాట్ అంటే చాలా ఇష్టం. సెయింట్ ట్రోపెజ్‌లో ఆమె ఇమేజిలు అధ్బుతం. క్లాస్ జనాభాకు సోఫియా లోరెన్ అంటే మరీ మరీ ఇష్టం అని అన్నారు.

    ఈ పోర్టల్‌లో పెట్టిన కలెక్షన్ అంతా నా డ్రీమ్. ఈ కలెక్షన్ ధరించి అమ్మాయిలు వారియక్క అందాలను, సంపదను ప్రపంచానికి చూపించి సెలబ్రేట్ చేసుకోవాలనేది నా ధ్యేయం అని అన్నారు. ఇటీవల జరిగిన కేన్స్ చలన చిత్రోత్సవానికి కెల్లీ బ్రూక్ వెళ్లినప్పుడు ఓ బిజినెస్ మ్యాన్ కెల్లీ బ్రూక్ అందాలను చూసి తట్టుకోలేక ఒక రాత్రి తనతో గడపాల్సిందిగా కోరాడు.

    ది మిర్రర్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఆ బిజినెస్ మ్యాన్ పేరు 'ఫెఢ్రిక్'. 'బ్రూక్ మెజెస్టిక్ బారియర్' హోటల్‌లో ఓ ఫోటోకాల్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కెల్లీ బ్రూక్ వద్దకు వెళ్లి తనతో ఒక రాత్రి గడపాల్సిందిగా కోరడం అందుకు బదులుగా € 1 మిలియన్ చెక్కుని తనకు ఆఫర్ చేస్తున్నట్లు చెప్పాడు. అతను కెల్లీని పట్టుకోని కేవలం ఒక్క రాత్రి మాత్రమే. ప్లీజ్ నా ఆఫర్‌ని అంగీకరించు.. ఇదిగో చెక్ తీసుకో అంటూ అల్లరి చేస్తుండగా.. కెల్లీ బ్రూక్ బాడీగార్డులు అతనిని తీసుకోని హోటల్ బయట వదిలిపెట్టారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Model-actress Kelly Brook says her new fashion range is inspired by former French model Brigitte Bardot because she was famed for her curvy figure.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X