లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నటుడు కన్నుమూత.. షాక్‌లో హాలీవుడ్
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఏలియన్ చిత్రాల్లో విభిన్నమైన నటనను ప్రదర్శించిన బ్రిటన్ యాక్టర్ ఇయాన్ హోమ్ ఇక లేరు. పార్కిన్సన్ వ్యాధితోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఇయాన్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతితో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 1981లో వచ్చిన చారియట్స్ ఆఫ్ ఫైర్ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను ఆయన ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు.
రాయల్ షేక్‌స్పియర్ కంపెనీలో స్టేజ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించిన ఇయాన్ హోమ్, ఆ తర్వాత 1979లో ఏలియన్ సినిమా ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. అథ్లెటిక్ కోచ్‌గా చారియట్స్ ఆఫ్ ఫైర్ చిత్రంలో ఉత్తమ నటనకు గాు బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డును, ఆస్కార్ ఉత్తమ సహాయ నటుడుఅవార్డును అందుకొన్నారు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రంలో బిల్బో బాగిన్స్ పాత్రలో ఆకట్టుకొన్నారు. ది హ్యబిట్ సిరీస్‌లో కూడా ప్రేక్షకుల మెప్పించారు.

సర్ ఇయాన్ హోమ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం మహా విషాదం. ఆయన శుక్రవారం ఉదయం మరణించారు. ఆయ వయసు 88 సంవత్సరాలు అని గార్డియన్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రశాంతంగా కన్నుమూశారు. ఆకట్టుకొనే రూపం, దయాగుణం, అద్భుతమైన టాలెంట్ కలిగిన నటుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు తమ సంతాపంలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











