»   » తప్పతాగి నైట్ క్లబ్‌లో హీరోయిన్ గొడవ, అరెస్ట్!

తప్పతాగి నైట్ క్లబ్‌లో హీరోయిన్ గొడవ, అరెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్యాంకాక్: బాగా మద్యం సేవించి నైట్ క్లబ్ లో గొడవ చేసిన బ్రిటిష్ నటి అన్నా రీస్ అరెస్టయింది. ఈ గొడవతో పాటు రెండేళ్ల క్రితం కారు వేగంగా నడుపుతూ పోలీస్ అధికారి ప్రాణాలు పోవడానికి కారణమైన కేసు కూడా ఉండటంతో రెండు కేసుల్లో కలిపి ఆమెను అరెస్టు చేసారు.

ఆదివారం రాత్రి అర్దరాత్రి దాకా పీకలదాకా మద్యం సేవించిన అన్నా రీస్... బిల్లు కట్టే విషయంలో అక్కడ వారితో గొడవ పడింది. కోపంతో నైట్ క్లబ్ లోని వస్తువులను విసిరేసింది. నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేసారు.

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే

నైట్ క్లబ్ లో గొడవ ఎందుకు చేసావ్ అని పోలీసులు ప్రశ్నిస్తే... ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే ఇరిటేషన్లో తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని అన్నా రీస్ తెలిపినట్లు పోలీసులు వెల్లంచారు.

ప్రస్తుతానికి విడుదల

ప్రస్తుతానికి విడుదల

అన్నా రీస్ విదేశీయురాలు కావడంతో ఆమెను జైల్లోనే ఉంచకుండా ప్రస్తుతానికి సొంత పూచికత్తు మీద విడుదల చేసారు.

విచారణ

విచారణ

అన్నా రీస్ మీద గతంలో పోలీసు అధికారి ప్రాణాలు పోవడానికి కారణమైన కేసు కూడా ఉండటంతో రెండు కేసులను పోలీసులు విచారణ జరుపుతున్నారు.

డబ్బు చెల్లిస్తే విముక్తి

డబ్బు చెల్లిస్తే విముక్తి

పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయిన కేసులో అధికారి కుటుంబ సభ్యులకు 6.2 మిలియన్ థాయ్‌లాండ్ కరెన్సీ సెటిల్మెంట్ కింద ఇవ్వాలని కోరగా.... ఆమె కేవలం 2 మిలియన్ థాయ్ కరెన్సీ మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఆ కేసు పెండింగులో ఉంది. ఆమె పూర్తి డబ్బు చెల్లిస్తే ఈ కేసు నుండి విముక్తి లభించే అవకాశం ఉంది.

English summary
A British actress who killed a policeman two years ago has been arrested after a drunken rampage in a Thai nightclub. Anna Reese, who starred in The Tsunami Warrior and Brown Sugar 2, 'began throwing things' after arguing with a group of men in the Bangkok venue last night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu