కన్నుమూసిన బ్రిటిష్ కమెడియన్ 'ఎరిక్'
లండన్, జులై 5: ప్రఖ్యాత బ్రిటిష్ కమెడియన్ 'ఎరిక్ స్క్రైస్తో' బుధవారం స్వల్ప జబ్బు కారణంగా స్వర్గస్ధులైనారు. ఈయన వయసు 89 సంవత్సరాలు. హాలీవుడ్‌లో బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన 'హ్యారీ పోట్టర్: ది గాబ్లెట్ ఆఫ్ ఫైర్', 'దోజ్ మాగ్నఫిసెంట్ మెన్ ఇన్ ధెయిర్ ఫ్లయింగ్ మెషిన్స్', 'ది ఫ్లాంక్' లాంటి అత్యంత అధ్బుతమైన సినిమాల్లో ఈయన నటించారు.
హాలీవుడ్‌లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోని, గొప్పవారిగా ఉన్న టోనీ హ్యాంకాక్, పీటర్ సెల్లర్స్, స్పైక్ మిల్లిగన్ లాంటి వారికి ఎరిక్ స్క్రైస్తో నాటకాలను వ్రాసి పెట్టారు. 1950లో అత్యంత ప్రజాదరణ చూరగొన్ని రేడియో కామెడీ షో 'ది గూన్ షో'లో కూడా ఎరిక్ స్క్రైస్తో పని చేశారు. ఆ తర్వాత 1960లో బిబిసిలో నటించిన టెలివిజన్ కామెడీ సిరిస్ షో 'గాలా ఓపెనింగ్' అతి తక్కువ కాలంలో ఈయనకు అత్యంత పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











