మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్న మాజీ భర్త
లాస్ ఏంజిల్స్: బ్రిటిష్ హాస్య నటుడు రస్సెల్ బ్రాండ్ నివేదిక ప్రకారం నటుడు డేవిడ్ హాసల్హోఫ్ మాజీ ప్రియురాలు డేటింగ్‌తో చేస్తున్నట్లు సమాచారం. 36 సంవత్సరాలు వయసు కలిగిన రస్సెల్ బ్రాండ్ గత డిసెంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య సింగర్ కాటి పెర్రీకి విడాకులు ఇచ్చిన తర్వాత వేరు వేరు అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్నా డు.
ప్రస్తుతం రస్సెల్ బ్రాండ్ ఒక ఛారిటీ కార్యక్రమ సమయంలో పరిచయమైన డేవిడ్ హాసల్హోఫ్ మాజీ ప్రియురాలు మోడల్ 'అనోష్క డి జార్జియు' తో డేటింగ్ మొదలు పెట్టినట్లు ఈ చూసిన వారు మాట్లాడుకుంటున్నారు. రస్సెల్ బ్రాండ్, అనోష్క డి జార్జియు ఇద్దరూ చూసేందుకు చక్కని పెయిర్ మాదిరి ఉన్నారు. ఇక అనోష్క డి జార్జియు చూడడానికి చక్కని పర్సనాలిటీతో ఆకట్టుకునే అందంతో ఉన్నారు.
రస్సెల్ బ్రాండ్, క్యాటీ పెర్రీ నుండి విడాకులు కోరడానికి గల కారణం తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. రస్సెల్ బ్రాండ్‌కి పిల్లలంటే చచ్చేంత ఇష్టం అంట. తన భార్యతో మనం ఫ్యామిలీని స్టార్ట్ చేద్దాం అని కోరగా, అందుకు క్యాటీ పెర్రీ అంగీకరించ లేదు. దీనికి గాను రస్సెల్ బ్రాండ్, భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. రస్సెల్ బ్రాండ్, క్యాటీ పెర్రీ ఇద్దరూ ప్రేమించుకోని 2010లో అంగరంగ వైభవంగా ఇండియాలో వివాహాం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి జరిగి కనీసం 14నెలలు కాక ముందే డిసెంబర్ 30, 2011న తామిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











