»   » ప్రపంచపు పాప్ రాణి నటించినటువంటి కోత్త ఆల్బమ్ మంటల్లో కాలిపోయిందోచ్..

ప్రపంచపు పాప్ రాణి నటించినటువంటి కోత్త ఆల్బమ్ మంటల్లో కాలిపోయిందోచ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాలం కలసిరావడం లేదంటే ఇదేనేమో..మొన్నటివరకు అస్తమానం వార్తల్లో నిలచి తన పరువంతా పోగోట్టుకున్న హాలీవుడ్ పాప్ సింగర్ ఇటీవలే ఓ కోత్త ఆల్బమ్ నిరూపోందించే పనిలో పడ్డారు. అది కాస్త ఇప్పుడు మంటల్లో కాలిపోయిందని అంటున్నాడు ఆఆల్బమ్ ప్రోడ్యూసర్. ఇంతకీ ఎవరా ఆపాప్ సింగర్ అని అనుకుంటున్నారా ఇంకెవరూ మన బ్రిట్నీ స్పియర్స్.

సూపర్ స్టార్ ప్రోడ్యూసర్ రుస్కో గాపిలవబడే క్రిస్టోఫర్ నిర్మాతగా బ్రిట్నీ స్పియర్స్ ఓ కోత్త ఆల్బమ్ రూపోందించనున్న సంగతి అందరికి తెలిసిందే. క్రిస్టోఫర్ హొమ్ స్టూడియోలోని గ్యారేజిలో కారుపార్కింగ్ వద్ద చిన్న మంటలు రావడంతో అతని ఇల్లంతా అల్లుకోని తగలపడిపోయిందని అన్నారు. అటువంటి సమయంలో తన వద్దనున్న హార్ట్ డిస్క్ లనుమాత్రమే కాపాడుకోగలిగానని కోత్తగా చేస్తున్నటువంటి ఈఆల్బమ్ నికాపాడుకోలేకపోయానని అన్నారు. ఇలాంటి పెద్ద ప్రమాదం నుండి బయటపడేసినటువంటి దేవుడికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

ఇది జరగడానికి కోన్నిరోజులు ముందే బ్రిట్ని స్పియర్స్ ఏజెంట్ తన ట్విట్టర్ లోఈసాంగ్ గురించి చాలా గోప్పగా ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2008వ సంవత్సరంలో వచ్చినటువంటి సర్కస్ తర్వాత ఇంతవరకు బ్రిట్ని స్పియర్స్ ఆల్బమ్ విడుదల కాలేదు. ఇంత సమయం తీసుకోని చేస్తున్నటువంటి ఈఆల్బమ్ ఏరేంజిలో ఉంటుందో ఊహించుకోండి అంటూ ఊరించాడు.

ఇది ఇలా ఉండగా కోన్నిరోజులకు ముందుగానే బ్రిట్ని స్పియర్స్ కొత్త ఆల్బమ్ ఫ్లజర్ యు ట్రాక్స్ కొన్నితను రిలీజ్ చేయడానికి కంటే ముందు మార్కెట్ లోకి విడుదల అవడం జరిగిందని విన్నాం. దానితో యావత్ బ్రిట్ని స్పియర్స్ టీమ్ అంతా షాక్ గురి అయ్యిన విషయం మనకు తెలిసిందే. దీనిపై బ్రిట్ని స్పియర్స్ టీమ్ ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం..

Please Wait while comments are loading...