ప్రియురాలి కెరియర్ నెంబర్ స్దానానికి రావాలనే ఉద్దేశ్యంతోనే ఏజెంట్‌గా
బ్రిట్నీ స్పియర్స్ ఒకప్పుడు ఈపేరు వినగానే ఒళ్శంతా ధ్రిల్లింతాలా ఉంటుంది అందుకు కారణం బ్రిట్నీ స్పియర్స్ రూపోందించినటువంటి ఆల్బమ్స్ అలాంటివి. మైఖెల్ జాక్సన్ తర్వాత పాప్ ప్రపంచాన్ని ఏలడానికి అన్ని అర్హతలున్నా కొన్ని చెడు అలవాట్లు వల్ల ఆనెంబర్ వన్ స్ధానానికి చేరుకోలేక పోతుంది. ఐతే మరలా తిరిగి తనని నెంబర్ వన్ స్ధానానికి చేర్చడం కోసం తన బాయ్ ప్రెండ్ జాసన్ ట్రావిక్ మరలా బ్రిట్నీతో జతకట్టారు.
టాక్సిక్ లాంటి బ్రాహ్మాండమైన హిట్‌ని సోంతం చేసుకున్నటువంటి బ్రిట్నీ స్పియర్స్ 2009వ సంవత్సరంలో జాసన్ ట్రావిక్‌తో డేటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే అతనితో డేటింగ్ చేయడం మొదలు పెట్టిందో అప్పటినుండి పాప్ ప్రపంచంలో నెమ్మదిగా తన స్దానాన్ని దిగజార్చుకోవడం మొదలు పెట్టింది. కానీ ఈసారి వీరిద్దరూ కలిసింది మాత్రం బ్రిట్నీని పాప్ రంగంలో మరలా అత్యున్నత శిఖరాలకు చేర్చాలనే ఉద్దేశ్యంతోనే.
జాసన్ ట్రావిక్ విలియమ్ ఎండీవర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో పనిచేసేన అనుభవం ఉంది. అటుతర్వాత పారిస్ హిల్టన్, టేలర్ షిప్ట్, హైలరీ డప్ లాంటి పాప్ రాణుల వద్ద కూడా కొంత అనుభవం సంపాదించాడు. ప్రస్తుతం విలియమ్ ఎండీవర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో పూర్తిగా మానివేసి ఒకప్పటి సూపర్ స్టార్ అయినటువంటి బ్రిట్నీ స్పియర్స్ కెరియర్‌కు సహాయపడదామనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం బ్రిట్నీ స్పియర్స్ టీమ్‌లో కూడా మెంబర్‌గా చేరడం, తనకి ఏజెంట్‌గా ఉండడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదేనని జాసన్ ట్రావిక్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











