ఆమెగారి మూడవ పెళ్లి పీటల దాకా వెళ్లకుండానే ఆగిపోయింది..??
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఇన్నాళ్లు ఎవరి కోసం అయితే కలలు కందో వారే ఆమెను మోసం చేసారు. బ్రిట్నీ వరల్డ్ టూర్ లో వున్నప్పుడు తన ఏజెంట్, మిత్రుడు జాసన్ ట్రావిక్ ను ప్రేమిస్తున్నట్టు తెలిపింది. కానీ ట్రావిక్ ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కేవలం స్నేహితులుగా మిగిలిపోదామని చెప్పాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ట్రావిక్ ఆమె మాజీ భర్తను కలిసి తాను బ్రిట్నీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు, అందుకు అతని అనుమతి కోరాడు. దీంతో బ్రిట్నీ ఎగిరిగంతేసినంత పని చేసింది.
తను కోరుకున్న వాన్నే పెళ్లిచేసుకోబోతున్నాననే ఆనందం బ్రిట్నీకి మరెంతో కాలం నిలువలేదు. ఇటీవల జసన్ లాస్ ఏంజిల్స్ లోని ఓ బార్ లో బాగా మద్యం సేవించి ఇద్దరు అమ్మాయిలతో చాలా చనువుగా మెలుగుతూ కనిపించాడు. ఆ తర్వాత వారిద్దరిలో ఓ అమ్మాయితో కలసి కార్ లో తన ఇంటికి వెళ్లాడు జాసన్. ఈ సన్నివేశాన్ని చూసిన వారు తప్పకుండా జాసన్ ఆ అమ్మాయితో ఈ రాత్రి గడిపివుంటాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే జాసన్ ఆ సమయంలో బ్రిట్నీ నుండీ వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోలేదట.
ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బ్రిట్నీ చెవున పడింది. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయింది. తను ప్రేమించిన వాడు చేసిన మోసాన్ని భరించలేక అతన్ని ఈ విషయమై అడిగితే అతను వారు కేవలం నా స్నేహితురాళ్లు మాత్రమే అని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. కానీ ఆమె అతన్ని ఇక పై కలవకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











