బరువు తగ్గి తన అభిమానుల ముందుకు వస్తానంటున్న పాప్ సింగర్ మాజీ భర్త .!
వాషింగ్టన్: బ్రిట్ని స్పియర్స్ మాజీ భర్త కెవిన్ ఫెడర్లిన్ తిరిగి తన కెరిర్ కు పూర్వవైభవం తీసుకోని రావడానికి చాలా కసరత్తులు చేస్తున్నాడంట. దానికి కారణం బ్రిట్ని స్పియర్స్ కు విడాకులు ఇచ్చిన తర్వాత కెవిన్ ఫెడర్లిన్ ఆర్దికంగా మానసికంగా నలిగిపోయాడు. ఆ దశలో తాను దేవదాసులాగా తయారుఅవ్వడం జరిగింది. ఇది గమనించిన ఆయన డాన్సర్ మార్లిన్ లోపేజ్ ఆయనకు బాసటగా నిలిచింది. అంతేకాకుండా మార్లిన్ లోపేజ్ మాట్లాడుతూ కెవిన్ ఫెడర్లిన్ తిరిగి తన స్ధానాన్ని మరలా తిరిగి సంపాదిస్తారని, దానికోసం ఆయన 25 ఎల్బీల బరువు కూడా తగ్గారని, ప్రస్తుతం ఆయన తను పూర్వం ఉన్న టాప్ షేప్ ను తిరిగి సంపాదించే యోచనలో వున్నారు. వచ్చో సంనత్సరంలో ఆయన తన అభిమానుల ముందు తిరిగి యాక్టింగ్ మరియు డాన్సులు చేసి వారి కోరికను తీరుస్తానన్నారని ఆమె తెలిపారు.
కొన్ని రోజుల క్రితం బ్రిట్నిస్పియర్ బాడీగార్డు ఫెర్నాడో ప్లోర్స్ బ్రిట్ని స్పియర్స్ తనను సెక్సువల్ హారాస్ మెంట్ చేస్తుందని లాసూట్లో పేర్కోన్నాడు. అంతేకాకుండా తన పిల్లలతో కూడా దారుణంగా ప్రవర్తిస్తుందని ఫెర్నాడో ఆరోపించారు. ఇటీవల కాలంలో పాప్ ప్రపంచంలో సెక్సీయెస్ట్ సింగర్ ఎవరు అని నిర్వహించిన ఈ సర్వేలో టాప్ లెస్ గా ఫోజులివ్వడానికి ఏ మాత్రం వెనుకాడని బ్రిట్నీమొట్టమొదటి స్దానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











