స్టేజీపై 'టాప్' లేపేసే సెక్సీ తార జీవితం ఆందోళనకరం..!!
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే పాప్ తార బ్రిట్నీ స్పియర్స్ తాజాగా బిల్ బోర్డ్ మ్యూజిక్ సంస్థ జరిపిన ఆన్ లైన్ సర్వేలో టాప్ ప్లేస్ లో నిలిచింది. పాప్ ప్రపంచంలో సెక్సీయెస్ట్ సింగర్ ఎవరు అని నిర్వహించిన ఈ సర్వేలో టాప్ లెస్ గా ఫోజులివ్వడానికి ఏ మాత్రం వెనుకాడని బ్రిట్నీ టాప్ ప్లేస్ లో నిలిచింది.మిలే సరస్, రిహాన్నా, లేడీ గాగ, టేలర్ స్విఫ్ట్ లాంటి అందెగత్తెలెందరో పోటీపడినప్పటికీ బ్రిట్నీ 27% ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఇదిలా వుంటే ప్రస్తుతం బ్రిట్నీ జీవితం ప్రస్తుతం చాలా ప్రమాదకరంగా వుందని ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మరో సారి మానసికంగా విపరీతంగా ప్రవర్తించిన బ్రిట్నీకి తన ఇద్దరి పిల్లలను పెంచే శక్తి లేదని, పిల్లలను ఆమె మాజీ భర్త, పిల్లల తండ్రి అయిన కెవిన్ కు అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అంతే కాదు అత్యవసర పరిస్థితులలో తప్పించి ఆమె తన పిల్లలను కలుసుకోవడానికి వీలు లేదని కోర్టు హుకుం జారీ చెయ్యడంతో బ్రిట్నీ మరింతగా కృంగి పోయింది, దీనికి తోడు ఆమె ఆసుపత్రి నుండీ అర్ధాంతరంగా నిష్క్రమించిందని, పూర్తి చికిత్స కాకుండామే ఆమె ఇలా చెయ్యడం ఆందోళన కలిగిస్తోందని వారు మీడియాతో తెలిపారు.


Click it and Unblock the Notifications











