ఆల్బమ్ విడుదల కాకముందే మార్కెట్ లోకి విడుదలైన ఆడియో ట్రాక్స్..
మైఖెల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఆయన అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది పాప్ సింగర్ బ్రిట్ని స్పియర్స్. ఎన్నో సార్లు వార్తల్లోకి ఎక్కి తన పేరు ప్రఖ్యాతులను అప్రదిష్టపాలుచేసుకున్న బ్రిట్ని స్పియర్స్ ఏమనుకున్నారో ఏమో ఇక తన కెరీర్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఫ్లజర్ యు అనే కొత్త ఆల్బమ్ నురూపోందించడానికి పూనుకున్నారు. తాను రూపోందించినటువంటి కొన్ని ట్రాక్స్ తను రిలీజ్ చేయడానికి కంటే ముందు మార్కెట్ లోకి విడుదల అవడం జరిగిందంట.
దానితో యావత్ బ్రిట్ని స్పియర్స్ టీమ్ అంతా షాక్ గురి అవ్వడం జరిగిందంట. ఐతే దీనిపై స్పందించినటువంటి బ్రిట్ని స్పియర్స్ టీమ్ లీక్ అయినటువంటి ట్రాక్స్ ప్లజర్ యు ట్రాక్స్ కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ట్రాక్స్ 2008సంవత్సరంలో విడుదల చేసినటువంటి సర్కస్ ఆల్బమ్ తర్వాత ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆల్బమ్ విడుదల చేయలేదని మ్యూజిక్ ప్రోడ్యూసర్ సీన్ గారెట్ వివరించారు.
ఇక ఈకోత్త ప్లజర్ యు ట్రాక్స్ విషయానికి వస్తే ఇందులో బ్రిట్నిస్పియర్స్ మూడు నిమిషాలపాటు డాన్స్ చేస్తుందని, అంతేకాకుండా ఈవీడియోలో ఒక సర్వెంట్ రెస్టారెంట్ కోచ్చినటువంటి కస్టమర్ కిఏమికావాలో అడిగి సర్వ్ చేస్తూ ఉంటాడని ఆనేపధ్యంలో ఈపాట కోనసాగుతుందని అన్నారు. చివరగా దీనిపై స్పందించిన బ్రిట్నిస్పియర్స్ మాట్లాడుతూ మొదట ఈ ట్రాక్స్ లీక్ అయినవి అనగానే నేను కూడా చాలా షాక్ తిన్నానని అన్నారు. ప్రస్తుతం నేను మరోక కొత్త ఆల్బమ్ చేస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











