twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె ముచ్చటగా మూడో సారి పెళ్లి కూతురు కాబోతోంది..!!

    By Kuladeep
    |

    ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన బాయ్ ఫ్రెండ్ జాసన్ ట్రావిక్ ను పెళ్లి చేసుకోవాలని తెగ కలలు కంటోంది. ఇప్పటికే రెండు సార్లు అతని వద్ద ఈ ప్రతిపాదనని తీసుకువచ్చినా వాటిని అతను సున్నితంగా తిరస్కరించడంతో ఆమె కలలు ఆమె కంట కన్నీళ్లుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్న ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోతోందట. దీనికి కారణం ఆమె బాయ్ ఫ్రెండ్ ట్రావిక్ ఆమె మాజీ భర్త కెవిన్ ఫెదర్లిన్ తో సమావేశం అయ్యారట.

    ఇందులో ఆమె అంతగా ఆనందించేందుకు ఏముంది అనుకుంటున్నారా..!! అసలు సంగతి ఏంటంటే ఈ సమావేశంలో ట్రావిక్, కెవిన్ తో బ్రిట్నీ ను తన వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పి, దీనికి అతని అనుమతి కోరాడట. కెవిన్, బ్రిట్నీ జంటకు కలిగిన పిల్లలను తన పిల్లలు గా చూసుకుంటానని కూడా ట్రావిక్, కెవిన్ కు మాటిచ్చాడట. ఈ ప్రతిపాదనకు కెవిన్ కూడా సానుకూలంగా స్పందించాడని సమాచారం.

    ఈ విషయం తెలిసిన బ్రిట్నీ కూడా కెవిన్ సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మన పాప్ సింగర్ మూడో సారి పెళ్లి కూతురు కానుందన్నమాట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X