twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రిట్నీ స్పియర్స్ తండ్రి ఆరాటం

    By Staff
    |

    బ్రిట్నీ స్పియర్స్ పాప్ సింగర్ గా త్వరగా లైమ్ లైట్ లోకి వచ్చిందో అంతే త్వరగా వివాదాల్లో చిక్కుకొని ఫేడవుడ్ అయింది. అటు పై ఎన్నో విమర్శల పాలయిన ఈ పాప్ తార డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అలాంటి తార ఇప్పుడు ఎంతో ఆనందంగా గడుపుతోంది అంటే దానికి కారణం ఆమె తండ్రే... అంతే కాదు కోర్టులో నెగ్గి తన పిల్లలను తన సొంతం చేసుకొన్న ఆమె ఇటీవల ఓ పత్రిక జరిపిన సర్వేలో ఉత్తమ తల్లిగా నిలిచింది.

    ప్రస్తుతం సర్కస్‌ టూర్‌లో ఉన్న బ్రిట్నీ తీరిక దొరికినప్పుడల్లా తన ఇద్దరి పిల్లల్ని చంకనేసుకుని సెక్యూరిటీ గార్డుల సహకారంతో సినిమాలు చూసి ఎంజాయ్‌ చేస్తోంది. జీవితంలో ఎన్నో ఎగుడుదిగుడులను చవిచూచిన బ్రిట్నీ ఇమేజ్‌ను తిరిగి కొద్ది కొద్దిగా క్లీన్‌ చేసే పనిలో పడ్డాడు ఆమె తండ్రి జెమీ స్పీయర్స్‌. బ్రిట్నీ చుట్టుపక్కలకు ఎవరిని చేరనీయకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆమె సన్నిహితుల్ని కూడా కలవనీయకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఆమెతో కొద్దిగా చనువుగా ఉండే వారు దీంతో తమను కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రిట్నీని కలవద్దంటూ ఆమె తండ్రి హెచ్చరిస్తాడేమోనని భయపడుతున్నారు. వివాదాల్లో చిక్కుకుని చెడ్డపేరు తెచ్చుకున్న బ్రిట్నీ తిరిగి మంచి పేరు సంపాదించుకోవాలని ఆ తండ్రి ఆరాటపడుతున్నాడు. ఎంతైనా తండ్రి తండ్రే కదా!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X