నేను సెక్సీ ఏంటీ.. నాకంత సీన్ లేదు...!!
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన పాటలతోనే కాక సెక్సీ బాడీతో, లుక్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కొంత మందయితే ఆమె పాటలకన్నా ఆమె సెక్సీ లుక్స్ కే అభిమానులయిపోయారంటే అందులో అతిశయోక్తి లేదని అనిపిస్తుంది. కానీ తను చాలా సెక్సీగా వుంది అంటే బ్రిట్నీ ఒప్పుకోదు. నేను సెక్నీ ఎంటీ నాకంత సీన్ లేదులెండి అని ముక్తసరి సమాధానంతో ఆ విషయాన్ని అతటితో ముగించేస్తుంది.
ఇదే విషయమై బ్రిట్నీని కలిసి వివరణ కోరితే తను తన బాడీతో ఎప్పుడూ సంతృప్తి చెందనని, తన బాడీ చాలా సెక్సీగా వుందని ఎవరైనా అంటే నాకే ఆశ్చర్యం వేస్తుందని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఎవరైతే తొనకని ఆత్మవిశ్వాసం తో తమ శరీరం మీద పూర్తి ఆధీనంతో కనిపిస్తారో వారే తన దృష్టిలో చాలా సెక్సీగా కనిపిస్తారని దానికో నిర్వచనం కూడా ఇచ్చేసింది. అలా సంతృప్తి చెందక కష్టపడుతోంది కాబట్టే ఇప్పుడు బ్రిట్నీకి ఇంత మంది అభిమానులు వున్నారు. ఏమంటారు..!!


Click it and Unblock the Notifications











