నష్టానికి ఖరీదైన ఇల్లుని అమ్మింది ఎవరి కొసం...?
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ బేవరీ హిల్స్‌లో ఉన్న తన ఇంటిని నష్టానికి అమ్ముకుందని సమాచారం. ఇక వివరాల్లోకి వెళితే 2007వ సంవత్సరం నుండి బ్రిట్నీ స్పియర్స్ ఆ ఇంట్లోనే నివసిస్తున్నారు. 2007వ సంవత్సరంలో బ్రిట్నీ ఆ ఇంటిని ఎంతో ఇష్టపడి $6.7 మిలియన్లకు కోనుగోలు చేశారు. కానీ హాఠాత్తుగా ఇప్పుడు ఆ ఇంటిని $2.9 మిలియన్లకు అమ్మడం జరిగింది.
ఈ విషయంపై బ్రిట్నీ స్పియర్స్‌ని అడడగా అవును నేను బేవరి హిల్స్‌లో ఉన్న నా ఇంటిని నష్టానికి అమ్మిన మాట వాస్తవమేనని అన్నారు. ఐతే ఈ నష్టం గురించి తాను ఏమీ బాధ పడడం లేదని అన్నారు. అందుకు కారణం అమెరికా వర్సన్‌కి చెందిన రియాలిటీ షో "ది ఎక్స్ ప్యాక్టర్" కార్యక్రమానికి సదరు కార్యక్రమ నిర్వాహాకులు బ్రిట్నీకి $10 మిలియన్లు చెల్లించనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











