పెళ్లికి 'నో' చెప్పినందుకు ఇంటికి...!!
ప్రముఖ పాప్ తార బ్రిట్నీ స్పియర్స్ తన వివాహ బంధాలతో జరిగిన గొడవలతో మానసికంగా బాగా కృంగిపోయింది. దాని నుండీ ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. దీనికి ఆమె తల్లిదండ్రులు, ఆమె మిత్రుడు, మేనేజర్ జాసన్ ట్రావిక్ ఆమెకు ఎంతో తోర్పాటును అందించారు. వారందించిన తోర్పాటుతో ఆమె సాధారణ స్థితికి వచ్చి గ్లోబల్ టూర్ కు కూడా వెళ్లి ఎంతో ఆనందంగా వుంది అన్న సంగతి తెలిసిందే. కానీ ఇటీవల ఆమె మనసు తిరిగి వివాహం మీద మల్లింది. తన కష్టకాలంలో తోడునీడగా నిలిచిన తన మిత్రుడు జాసన్ ట్రావిక్ ను వివాహం చేసుకోవాలని తలచిన ఆమె ఇటీవలే ఆ విషయాన్ని అతనికి తెలియజేసింది. కానీ ఈ ప్రతిపాదనని ట్రావిక్ సున్నితంగా తిరస్కరించాడు.
దీంతో దిగ్భ్రాంతికి లోనయిన బ్రిట్నీ అతన్ని తన టూర్ కార్యక్రమాల నుండీ అర్థాంతరంగా తప్పించి ఇంటికి పంపేసిందట. తన వివాహ ప్రతిపాదనని ట్రావిక్ తప్పకుండా ఆమోదిస్తాడని భావించిన బ్రిట్నీ ట్రావిక్ నిర్ణయాన్ని తట్టులేకపోయిందట. దీంతో అతన్ని తన దగ్గర వుండకని, వెంటనే వెళ్లిపొమ్మని కోరిందట. దాంతో చేసేదేమీ లేక ట్రావిక్ 24 గంటల్లో అక్కడి నుండీ ఇంటికి తిరిగి వచ్చేసాడట. దీనిపై బ్రిట్నీ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట, ఎక్కడ తమ కూతురు తిరిగి డిప్రెషన్ లోకి వెళ్లిపోతుందోనని...!!


Click it and Unblock the Notifications











