twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ ప్రియుడు చాలా మంచోడు.. అమ్మాయిల పిచ్చి ఉన్నోడు కాదు..!!

    By Kuladeep
    |

    ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన బాయ్ ఫ్రెండ్ జాసన్ ట్రావిక్ ను కలవకూడదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అతన్ని ఎంత గానో ప్రేమించిన ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఇటీవల జసన్ లాస్ ఏంజిల్స్ లోని ఓ బార్ లో బాగా మద్యం సేవించి ఇద్దరు అమ్మాయిలతో చాలా చనువుగా మెలుగుతూ కనిపించాడు. ఆ తర్వాత వారిద్దరిలో ఓ అమ్మాయితో కలసి కార్ లో తన ఇంటికి వెళ్లాడు జాసన్. ఈ సన్నివేశాన్ని చూసిన వారు తప్పకుండా జాసన్ ఆ అమ్మాయితో ఈ రాత్రి గడిపివుంటాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే జాసన్ ఆ సమయంలో బ్రిట్నీ నుండీ వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోలేదట.

    ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బ్రిట్నీ చెవున పడింది. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయింది. తను ప్రేమించిన వాడు చేసిన మోసాన్ని భరించలేక అతన్ని ఈ విషయమై అడిగితే అతను వారు కేవలం నా స్నేహితురాళ్లు మాత్రమే అని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. కానీ ఆమె అతన్ని ఇక పై కలవకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

    ఈ వార్త విన్న జాసన్ తో బార్ లో కనిపించిన యువతి తనకు ట్రావిక్ కు మధ్య వృత్తిపరమయిన సంబంధం తప్పింతే మరెలాంటి సంబంధమూ లేదని చెప్పుకొచ్చింది. ఆ రోజు మేము పనిచేస్తున్న బాస్ పుట్టిన రోజు కావడంతో కలసి పార్టీలో పాల్గొనాల్సి వచ్చిందని, అంతకు మించి మా మధ్య మరెంటా సంబంధం లేదని, జాసన్ చాలా మంచి వాడని క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ వార్త విన్న వారు కూడా ట్రావిక్ చాలా మర్యాద కల వ్యక్తి అని, ఇలాంటి పని చేసుండడని, బ్రిట్నీ తొందరపాటుతో అతన్ని దూరం చేసుకోవద్దని చెబుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X