ఫ్యాన్స్ కోసం నొప్పిని భరించింది: ఆసుపత్రిలో చేరిన బ్రిట్నీ స్పియర్స్

By Bojja Kumar

హైదరాబాద్: అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఆమె షో అంటే అభిమానులు పడి చస్తారు. ఇటీవల లాస్ ఏంజిల్స్ లోని ఓ క్యాసినోలో బ్రిట్నీ స్పియర్స్ షో ఏర్పాటు చేసారు. అయితే స్టేజీ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా బ్రిట్నీ పడిపోయింది. ఆమె పాదంలోని చీలమండలం(యాంకిల్) వద్ద గాయమైంది.

అయితే నిర్వాహకుల్ని, అభిమానుల్ని నిరాశపర్చకుండా.. తీవ్రమైన బాధను భరిస్తూ కో- డ్యాన్సర్స్ సహాయంతో బ్రిట్నీ స్పియర్ షో పూర్తి చేసింది. ఆమె మరన్నిపాటలకు పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నొప్పి భరించలేనంతగా ఉండటంతో....ఒక సాంగ్ షో అయిపోయిన వెనువెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

'నేను కోలువాలని కోరుకున్న మీ అందరికీ థ్యాంక్స్. నిజానికి కింద పడిపోయిన ఆ రాత్రి నేను ఎంతగానో బెదిరిపోయాను. యాంకిల్ దెబ్బతింది. కానీ ఇప్పుడు ఓకే' అంటూ శుక్రవారం ట్విట్టర్ లో బ్రిట్నీ స్పియర్స్ ట్వీట్ చేసింది. బ్రిట్నీ త్వరగా కోలు కోవాలని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Britney Spears cancels shows after onstage fall

ఆమె వ్యక్తిగత జీవిత విశేషాల్లోకి వెళితే...33 ఏళ్ల బ్రిట్నీ స్పియర్స్ డేవిడ్ లుకాడోను మూడవ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు పెళ్లిళ్ల తర్వాత తన మాజీ ఏజెంట్‌ జాసన్ ట్రావిక్‌తో కొంత కాలం సహాజీవనం చేసింది. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు కానీ ఎందుకనో అది ఆచరణకు నోచుకోలేదు. అతనితో విడిపోయాక లీగల్ రీసెర్చర్ డేవిడ్ లుకాడోకు దగ్గరైంది ఈ హాట్ బ్యూటీ.

అంతకు ముందు తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ని చేసుకోగా..అతనితో విడిపోయిన తర్వాత డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అతనితో కూడా స్పియర్స్ విడిపోయారు. డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌తో కలిసి సంసారం చేసినప్పుడు బ్రిట్నీ స్పియర్స్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. సీన్ ఫ్రెస్టన్ వయసు 8 సంవత్సరాలు కాగా.. జేడన్ జేమ్స్ వయసు 7 సంవత్సరాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X