ట్విట్టర్‌లో 10 మిలియన్ల బెంచి మార్క్‌కి చేరుకున్న సెలబ్రిటీ
మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ అయిన 'ట్విట్టర్'లో 10మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న వ్యక్తులలో కొత్తగా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ చేరారు. ఇప్పటి వరకు ఈ ఘనతకు ఐదుగురు ప్రముఖ సెలబ్రిటీలు చేరగా ఇప్పుడు బ్రిట్నీ స్పియర్స్ ఆరవ సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించారు. ఈ విషయాన్ని స్వయంగా బ్రిట్నీ స్పియర్స్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు.
ఈ సందర్బంలో బ్రిట్నీ స్పియర్స్ ఏమని ట్వీట్ చేశారంటే నేను ఇప్పడే తెలుసుకున్నాను నన్ను 10 మిలియన్ యూజర్స్ ఫాలో అవుతున్నారని, నాపై ఇంత ప్రేమని కురిపిస్తున్న అభిమానులకు ఎల్లప్పుడు కూడా రుణపడి ఉంటానని అన్నారు. ఆ తర్వాత ట్వీట్‌లో అభిమానుల అందరికి త్వరలో ఓ స్పెషల్ ఉంటుందని అంటున్నారు.
ఇక బ్రిట్నీ స్పియర్స్ ఇటీవలే ప్రముఖ సెలబ్రిటీలైన క్యాటి పెర్రీ, లేడిగాగా, జస్టిన్ బైబర్, బరాక్ ఒబామా, కిమ్ కర్దాషియాన్‌ని ఫాలో అవుతున్నారు.


Click it and Unblock the Notifications











