ఫిట్‌నెస్ గురించి నే చెబుతా వినండి..!
మహిళలకు అందమే ముఖ్యం అంటున్నారు పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్. అసలు మహిళలు ఆహారం తీసుకునే విషయంలో సరైన పద్దతులను పాటిస్తే రోజు వారీ జిమ్ కెళ్లాల్సిన అవసరమే ఉండదన్నారు. 30 సంవత్సరాల వయసు కలిగిన బ్రిట్నీ స్పియర్స్ ఇప్పటికీ తిండి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. ప్రతి రోజు తీసుకునే ఆహారంలో తప్పని సరిగా ఆరోగ్యంతో పాటు, పోషక విలువలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకుంటానని అన్నారు.
నేను చాలా పెద్దగా ఉంటాను కాబట్టి, ఎక్కువ ఆహారం తీసుకోవడంతో పాటు, వారానికి కేవలం మూడు సార్లు మాత్రమే వర్క్ అవుట్స్ చేస్తానని తెలిపారు. నా అందాన్ని మరింత మెరుగు పరచుకునేందుకు గాను రాత్రి వేళ చాలా త్వరగా నిద్రపోతానని తెలిపారు. వీటితో పాటు అదనంగా శరీరాన్ని ఎప్పుడూ శాంతంగా ఉంచుకునేందుకు గాను ఎక్కువ నీరు తాగుత్రానని తెలిపారు. ఇప్పుడు అసలు బ్రిట్నీ స్పియర్స్ కొత్తగా చిలుక పలుకలను పలకడానికి కారణం రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న జాసన్ ట్రావిక్‌ని బ్రిట్నీ స్పియర్స్ పెళ్లి చేసుకోనున్నారు.
వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ప్లానెట్ హాలీవుడ్ రిసార్ట్‌లో అత్యంత వైభవంగా శుక్రవారం జరిగింది. ఐతే ఈ ప్రయివేట్ కార్యక్రమానికి బ్రిట్నీ, ట్రావిక్ దగ్గర బంధువులను ఆహ్వానించడం జరిగింది. ఎంగేజ్ మెంట్ తర్వాత పారిస్ హోటల్‌లో అతిధులకు అద్బుతమైన డిన్నర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అందరి కోసం చాతే నైట్ క్లబ్‌లో డాన్స్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది.
జాసన్ ట్రావిక్, బ్రిట్నీతో ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్ని తన స్నేహితుడు టివీ యాంకర్ బిల్లీ బుష్ ద్వారా అధికారకంగా ప్రకటింపజేశాడు. బ్రిట్నీ స్పియర్స్ కూడా తన ఎంగేజ్ మెంట్‌ని మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది.


Click it and Unblock the Notifications











