బ్రిట్నీ జీవితంలో మరోసారి నీలినీడలు అలుముకోనున్నాయా..!!

By Kuladeep

ప్రముఖ పాప్ తార బ్రిట్నీ స్పియర్స్ పాప్ ప్రపంచంలో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించిందో, వ్యక్తిగత జీవితంలో అన్ని ఒడిదుడుకులని అనుభవించింది. తన మొదటి వివాహం కేవలం 55 గంటల్లో ముగిసిపోగా, రెండవ పెళ్లి ఇద్దరు పిల్లలు కలిగాకా ఎంత దారుణంగా పెటాకులయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు బ్రిట్నీ ఎంతో సన్నిహితంగా మెలిగే ఆమె ఆంటీ సాండ్రా బ్రిడ్జెస్ మరణించడంతో ఆమె డిప్రెస్ అయి విపరీతంగా ప్రవర్తిస్తూ తనని తాను హింసించుకోవడంతో ఆమె ఇద్దరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని ఆమె తండ్రి జెమీ స్పీయర్స్ కు ఆమెను అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

దీంతో ఆమె అప్పటి నుండీ తన తండ్రి ఆధీనంలోనే వుంటూ వస్తోంది. నిబంధనల ప్రకారం ఆమె గత క్రిస్మస్ నాటికే తన తండ్రి ఆధీనం నుండీ విడుదల కావాల్సివుంది. బ్రిట్నీ కూడా ఎంతో నెమ్మదిగా మసలుకుంటూ వుండటంతో ఆమె ఖచ్చితంగా విడుదల కానుందని అందరూ భావించారు. కానీ క్రిస్మస్ కు ముందే ఆమె తన తండ్రి ఆధీనంలోనే వుండాలని కోర్టు ఆదేశించడంతో ఆమె ఖంగుతింది. దీనికి తోడు ఆమె ఎంతగానో ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ జాసన్ ట్రావిక్ తనని మోసం చేసాడు అనే అనుమానం ఆమెను పట్టివుంచలేకపోయింది. అదేసమయంలో అతను పబ్ లో ఇద్దరు అమ్మాయిలతో సన్నిహితంగా మెలుగుతూ అందరి కంటా పడటంతో ఆమె అతన్ని వదిలించుకుంది. దీంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

తన తండ్రి కూడా ఆమెను విడుదల కానీకుండా తన ఆధీనంలో వుంచుకోవాలని ప్రయత్నించడంతో ఆమెకు అతని మీద ఓ విధమైన అపనమ్మకం ఏర్పడటంతో ఆమె మరింత డిప్రెస్ అయిపోయింది. బ్రిట్నీ మీద ఆర్థికపరమయిన ఆంక్షలు కూడా విధించడంతో ఆమె ఇటీవల ఓ షాపింగ్ మాల్ లో తన బాడీ గార్డ్ క్రెడిట్ కార్డు వాడి, అతనికి బదులు ఆమె సంతకం చెయ్యడంతో పెద్ద రసాభాసాజరిగి అక్కడి నుండీ అవమాన భారంతో బయటపడింది. దీంతో ఆమె తన తండ్రి మీద మితిమీరిన కోపంతో చిందులెయ్యగా అతగాడు ఆమెను తిరిగి మెంటల్ హాస్పిటల్ కు పంపిస్తానని బెదిరించడంతో మారు మాట్లాడకుండా కిక్కున వుండిపోయిందట. ఇది చూసిన వారు పాపం బ్రిట్నీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అనుకుంటున్నారట. కోట్లు సంపాదించే ఆమెకు తన క్రెడిట్ కార్డుతో 1500 డాలర్లకు మించి ఖర్చు పెట్టే సౌలభ్యం లేకుండా చెయ్యడం ఆమెకు తనని అందరీ అవసరాలకోసం వాడుకుంటున్నారనే అభద్రతా భావం మరింత పెరిగేలా చేసిందని మానసిక వైధ్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకు ముందో సారి గుండు చేయించుకొని, ఆత్మహత్యాప్రయత్నాలతో తనని తాను హింసించుకున్న బ్రిట్నీ మరో సారి అలాంటి తప్పిదం చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయని పరిశీలకులు అంటున్నారు...!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X