For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తన అండర్‌ వేర్ డిజైన్స్ ట్రై చేయమంటోంది!

    By Bojja Kumar
    |

    లండన్: పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవలే తన పేరుతో లింగరీ కలెక్షన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నగరాల్లో వీటిని అమ్మేందుకు స్టోర్స్ కూడా తెరిచింది. ప్రస్తుతం ఆమె తన లింగరీ బ్రాండ్‌కు ప్రచారం కల్పించే పనిలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఆమె చేసిన ప్రకటన ఆశ్యర్యానికి గురి చేసింది.

    ఇటీవల బ్రిటన్‌లో పర్యటించిన బ్రిట్నీ స్పియర్స్ అక్కడి రాయల్ ఫ్యామిలీలను టార్గెట్ చేసింది. బ్రిటర్ యువరాజు భార్య కేట్ మిడిల్టన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. తన లింగరీ డిజైన్స్ కేట్ మిడిల్టన్ వేసుకుంటే చూడాలని ఉందని, అవి ధరిస్తే కేట్ చాలా అందంగా ఉంటుందంటూ... బ్రిట్నీ స్పియర్స్ వ్యాఖ్యానించింది. బ్రిట్నీ లింగరీ డిజైన్స్ కేట్ మిడిల్టన్ ఇష్ట పడితే....బ్రిటన్‌లో వాటి అమ్మకాలు పెరుగుతాయని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు.

    Britney Spears: I Would Love To See Kate (Middleton) In My Underwear Designs

    హాలీవుడ్ హీరోయిన్లు, ఫేమస్ పాప్ స్టార్స్ తమ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన పెర్ఫ్యూమ్స్, స్పెషల్‌గా డిజైన్ చేసిన లింగరీ(లో దుస్తులు) విడుదల చేయడం అనే ఆనవాయితీ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి కార్యక్రమాలతో తమ పబ్లిసిటీ పెరగడంతో పాటు, డబ్బు కూడా వస్తుండటంతో చాలా మంది తారలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో బ్రిట్నీ స్పియర్స్ కూడా చేరి పోయారు.

    English summary
    Pop diva Britney Spears who recently launched her lingerie collection- Intimate Britney Spears is busy promoting and launching the stores at different locations. Britney Spears who was last seen in London has expressed who she hopes will don her lingerie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X