twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సందడి లేకుండా మూడవ పెళ్లి చేసుకుంటున్నా..!

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న జాసన్ ట్రావిక్ ఇద్దరికి ఇటీవలే ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. ఐతే వీరి పెళ్లి పెద్ద ఎత్తులో జరుగుతుందని అభిమానులను ఊహించుకోవద్దని బ్రిట్నీ కోరడం జరిగింది. అందుకు గల కారణాలను కూడా బ్రిట్నీ స్పియర్స్ వెల్లడించింది. గతంలో బ్రిట్నీ స్పియర్స్ చేసుకున్న రెండు పెళ్లిళ్లు కూడా విడాకులతో పటా పంచలవడంతో, ఈసారి జరగబోయే మూడవ పెళ్లి అన్న కలకాలం ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

    ఈసారి జరగబోయే మూడవ పెళ్లి ఎంత కూల్‌గా, ఎటువంటి హాడావుడి లేకుండా బ్రిట్నీ స్పియర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ మీడియా అవుట్ లెట్ డైలీ మెయిల్ ప్రచురించిన కధనం ప్రకారం బ్రిట్నీ స్పియర్స్, జాసన్ ట్రావిక్‌ల పెళ్లి ఈవెంట్ వారి యొక్క సొంత పట్టణం లూసియానాలో జరగనుందని తెలిపింది. వీరిద్దరి ట్రెడిషనల్ సెరమనీకి బాగా సుపరిచితమైన ఆతి కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది.

    ఈ పెళ్లికి బ్రిట్నీ స్పియర్స్ పిల్లలు ఇద్దరు స్నేహితులను కూడా ఆహ్వానించడం జరిగింది. పెళ్లి అంతా సదరన్ - స్టయిల్‌లో చేసుకోనుందని సమాచారం. ఈ నెల మొదట్లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ప్లానెట్ హాలీవుడ్ రిసార్ట్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఐతే ఈ ప్రయివేట్ కార్యక్రమానికి బ్రిట్నీ, ట్రావిక్‌ దగ్గర బంధువులను ఆహ్వానించడం జరిగింది. ఎంగేజ్ మెంట్ తర్వాత పారిస్ హోటల్‌లో అతిధులకు అద్బుతమైన డిన్నర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అందరి కోసం చాతే నైట్ క్లబ్‌లో డాన్స్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది.

    English summary
    Fans should not be expecting an extravagant ceremony from Britney Spears and fiance Jason Trawick when the two finally tie the knot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X