'సత్యభామ' లా ఫ్రవర్తిస్తోన్న పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్
ప్రముఖ పాప్ తార బ్రిట్నీ స్పియర్స్, ఆమె స్నేహితుడు జాసన్ ట్రావిక్ ల మధ్య నిశ్శబ్ద యుద్ధం నడుస్తోందని వారిద్దరినీ చూస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడూ ఉల్లాసంగా తిరుగుతూ వుండే ఈ జంట ఈ మధ్య ఎక్కడికీ వెళ్లకుండా హోటల్ గదికే పరిమితమయ్యారట. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలుగా వుంటున్నారట వీరిద్దరూ. బ్రిట్నీ అయితే ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ పదేపదే ఏడుస్తోందట.
x17online.com కథనం ప్రకారం ఇటీవల బ్రిట్నీ, జాసన్ కాఫీ బార్ కు వెళ్లినప్పుడు, జాసన్ తనతో వుండకుండా బయట ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూ వుండటం బ్రిట్నీ తట్టులేకపోయిందట. దీంతో అతని మీద అగ్గిమీదగుగ్గిలం అయిందట. దీంతో ఇద్దరూ ముభావంగా వుంటున్నారట. బ్రిట్నీ తనని కొంత సమయం కూడా ఓంటరిగా వుండనివ్వటం లేదని ట్రావిక్ బాధపడుతున్నాడు.
గత మంగళవారం నాడు ఈ జంట డ్రైవ్ కు వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో కూడా బ్రిట్నీ ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూ గట్టిగా ఏడుస్తోందట. దీంతో ఏమైంది వీరిద్దరికీ అని చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతున్నారచట. దీంతో ఈవిడ గారి ఏడుపు చూడలేక ట్రావిక్ ఎక్కడికీ వెళ్లడం లేదట. ఏది ఎలా వున్న బ్రిట్ని తను అనుకున్నది సాధించుకుంది. మన సత్యభామ కృష్ణున్ని సాధించుకుననట్టు.
ఇంతకు ముందు బ్రిట్నీ ఆస్ట్రేలియా పర్యటనలో వున్నప్పుడు ట్రావిక్ వద్ద పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చిందని, దీనికి అతను ఒప్పుకోకపోయేసరికి అతన్ని ఇంటి తిరిగి వెళ్లపొమ్మని చెప్పిందని, దీంతో ట్రావిక్ అమెరికా తిరిగి వచ్చేసాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను ఆమె సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. వారిద్దరి మధ్య గొడవలే వుంటే డిసెంబరు 2న జరిగిన ఆమె పుట్టిన రోజుకు అతను ఎందుకు వస్తాడని ఎదురుప్రదర్శిస్తా.


Click it and Unblock the Notifications











