రోమాంటిక్ ట్రిప్పు ద్వారా తనలోని ప్రేమను తెలియజేసినటువంటి హీరో..
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వరల్డ్ టూర్ లో వుండగా తన ఏజెంట్, మిత్రుడు జాసన్ ట్రావిక్ ను ప్రేమిస్తున్నట్టు తెలిపింది. కానీ ట్రావిక్ ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కేవలం స్నేహితులుగా మిగిలిపోదామని చెప్పాడు. కానీ బ్రిట్నీ మాత్రం పట్టు వదలకుండా అతని ప్రేమకోసం పరితపించింది. ఆమె పట్టుదలతో చివరికి ట్రావిక్ ప్రేమను గెలుచుకుంది. ఆ తర్వాత ట్రావిక్ బ్రిట్నీ మాజీ భర్తను కలిసి తాను బ్రిట్నీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పి, అందుకు అతని అనుమతి కూడా కోరాడు. దీంతో బ్రిట్నీ చాలా సంతోషించింది.
ఐతే ఇటీవల వీరిద్దరూ విడిపోయారంటూ చాలా పుకార్లు పుట్టాయి. వీటన్నింటికి సమాధానం కోసం ఇద్దరూ కలసి మెక్సికో ఓ రోమాంటిక్ ప్లాన్ చేశారని సమాచారం. ఈరోమాంటిక్ ట్రిప్పులో తన ప్రేమను మరింత బ్రట్ని స్పియర్స్ తోపంచుకున్నాడని సమాచారం. ఇక వివరాల్లోకి వెళితే బ్రిట్నీ స్పియర్స్ మాట్లాడుతూ ఇటీవల మేము ఇద్దరం విడిపోయామంటూ వచ్చినటువంటి రూమర్స్ నన్ను చాలా భాదించాయి. అంతేకాకుండా జాసన్ ట్రావిక్ కునామీద ప్రేమ తగ్గిందంటూ చాలా మంది పుకార్లు సృష్టించారు. దీనికి పర్యావసానంగా జాసన్ ట్రావిక్ ఏమిచేశాడో తెలుసా నాకు తెలియకుండా నా 29వ పుట్టినరోజుకోసం మెక్సికోలోని ప్యూర్టో వల్లర్తా లోప్లాన్ చేసిన తీరు అధ్బుతం అని అన్నారు.
ఎప్పుడైతే మేము మెక్సికో లోఅడుగు పెట్టగానే మాకోసం ప్రత్యేకంగా తీసుకున్నటువంటి విల్లా లోబస చేయడం, దీనితోపాటు నాపుట్టినరోజు చేసినటువంటి తీరు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు. నాకోసం జాసన్ ట్రావిక్ ప్రత్యేకంగా తయారుచేయించినటువంటి రెడ్ కేక్ నాకు మతి పోగోట్టిందని అన్నారు. దీనివల్ల జాసన్ ట్రావిక్ నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్దం అయ్యిందని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రేమించిన వారికి ఇలా తెలియకుండా ఇచ్చేటటువంటి సర్ ప్రైజ్ లు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు.


Click it and Unblock the Notifications











