హాట్ లేడీ లింగరీకి భలే డిమాండ్
న్యూయార్క్: హాలీవుడ్ హీరోయిన్లు, ఫేమస్ పాప్ స్టార్స్ తమ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన పెర్ఫ్యూమ్స్, స్పెషల్‌గా డిజైన్ చేసిన లింగరీ(లో దుస్తులు) విడుదల చేయడం అనే ఆనవాయితీ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి కార్యక్రమాలతో తమ పబ్లిసిటీ పెరగడంతో పాటు, డబ్బు కూడా వస్తుండటంతో చాలా మంది తారలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ప్రముఖ హాలీవుడ్ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ తన పేరుతో న్యూ కలెక్షన్ లింగరీ(లో దుస్తులు) విడుదల చేసింది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో బ్రిట్నీ స్పియర్స్ న్యూ లింగరీ కలెక్షన్ ధరించి మోడల్స్ ర్యాంప్ వాక్ చేసారు. ఈ న్యూ కలెక్షన్ లాంచ్ పార్టీలో బ్రిట్నీ స్పియర్స్ ఎరుపురంగు డ్రెస్సులో స్లిమ్ లుక్‌లో దర్శనమిచ్చింది.

ఇక బ్రిట్నీ స్పియర్స్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే...ఆమె ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ డేవిడ్ లుకాడోతో విడిపోయింది. గత కొంత కాలంగా అతనితో క్లోజ్‌గా ఉంటున్న బ్రిట్నీ స్పియర్స్ ఇటీవల తన చేతి వేలికి గోల్డ్ రింగుతో దర్శనమిచ్చింది. దీంతో వీరు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే వ్యవహారం పెళ్లి పీటల దాకా వెళ్లక ముందే అతనితో విడిపోయింది బిట్నీ.
సెక్సీ లింగరీస్(లోదుస్తులు)వాలెంటైన్ డే స్పెషల్
బ్రిట్నీ స్పియర్స్ తన మాజీ ఏజెంట్ జాసన్ ట్రావిక్‌తో కొంత కాలం సహాజీవనం చేసింది. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు కానీ ఎందుకనో అది ఆచరణకు నోచుకోలేదు. అంతక ముందు తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ని చేసుకోగా.. ఆ తర్వాత డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరి నుండి స్పియర్స్ విడిపోయారు. డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌తో కలిసి సంసారం చేసినప్పుడు బ్రిట్నీ స్పియర్స్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. సీన్ ఫ్రెస్టన్ వయసు 8 సంవత్సరాలు కాగా.. జేడన్ జేమ్స్ వయసు 7 సంవత్సరాలు.


Click it and Unblock the Notifications











