మా వంట గది అంటే చచ్చేంత ఇష్టం: పాప్ స్టార్
పాప్ స్టార్ బ్రిట్నీస్పియర్స్ ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తన ఇంటికి మద్యలో ఉన్న 'వంట గది' అంటే తనకు చాలా ఇష్టమని చెప్పడం జరిగింది. తాను ఇంట్లో ఉన్నప్పడు ఎక్కువ సమయాన్ని వంట గదిలోనే గడపడానికి ఇష్టపడతానని కూడా అన్నారు. 29 సంవత్సరాలు వయసు కలిగిన బ్రిట్నీ స్పియర్స్‌కు ఇద్దరు కుమారులు సీన్ ప్రెస్టన్(6), జేడేన్ జేమ్స్(5). వీరిద్దరూ కూడా తన మాజీ భర్త కెవిన్ పెడ్రలిన్ కు తనకు కలిగిన సంతానం.
బ్రిట్నీ స్పియర్స్ మాట్లాడుతూ మా ఇల్లు చాలా 'ట్రెడిషనల్' గా ఉంటుంది. కొత్తగా పెళ్లైన జంటకు హానీమూన్ చేసుకొవడానికి రిసార్ట్స్, గదులు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. మా పిల్లలు నేను కలసి ఎక్కువ సమయం వంట గదిలోనే గడపడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మాపిల్లలు స్కూల్ నుండి రాగానే వారి హోం వర్క్‌ని వంట గదిలో కూర్చొని చేసుకున్న సందర్బాలు అనేకం అని అన్నారు. అందుకే మా వంట గది అంటే మాకు అందరికి చాలా ఇష్టం అని అన్నారు.


Click it and Unblock the Notifications











