బ్రిట్నీ స్పియర్స్ పెళ్లి ఆశలపై నీళ్లు చల్లిన ట్రావిక్
నిత్యం వివాదాల్లో నిలిచి వుండే పాప్ తార బ్రిట్నీ స్పియర్స్ తన భర్తతో విడిపోయాక తన తల్లిదండ్రులతో, పిల్లలతో కలసి వుంటోంది. కానీ ఇటీవల బ్రిట్నీకు మళ్లీ పెళ్లి గాలి సోకింది. తన మేనేజర్, బాయ్ ఫ్రెండ్ జాసన్ ట్రావిక్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు కూడా తెలిపింది. వారు ఈ విషయమై నిర్ణయాన్ని బ్రిట్నీకే వదిలేసినట్టు తెలిసింది. కానీ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోమని సలహా ఇచ్చారట.
ఇదే విషయాన్ని బ్రిట్నీ నవంబరు 20వ తేదీన ట్రావిక్ కు తెలియజేసిందట. కానీ అతను ఆమె ప్రపోజల్ ను వ్యతిరేఖించడంతో ఆమె నిరుత్సాహపడ్డారట. కాగా వీరిద్దరు గత మూడేళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. ట్రావిక్ బ్రిట్నీ రెండవ పెళ్లితో జరిగిన గొడవలో ఆమెకు తోడునీడగా నిలిచి ఆమె తిరిగి మామూలు స్థితికి రావడానికి ఎంతో సహకరించాడు.
బ్రిట్నీ స్పియర్స్ పాప్ రారాణి హాలీవుడ్ పెళ్లి జాసన్ ట్రావిక్ britney spears jason trawick pop star marriage proposal hollywood


Click it and Unblock the Notifications