twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గూగుల్ ప్లస్‌'లో రికార్డు సృష్టించిన పాప్ స్టార్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ గూగుల్ సెర్చ్ ఇంజన్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌లో ఇటీవల కాలంలో ఎకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో ఎకౌంట్లు ఓపెన్ చేస్తే, అభిమానులు వారిని ఫాలో అవుతుండడం సాధారణ విషయమే. ఐతే ఇక్కడ బ్రిట్నీ స్పియర్స్ గూగుల్ ప్లస్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని రోజులకే, అప్పటి వరకు ఫాలోవర్స్ ఎక్కవగా ఉండి, టాప్ స్దానంలో ఉన్న గూగుల్ సిఈవో లారీ పేజి కంటే బ్రిట్నీ స్పియర్స్‌కు ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడం ఇక్కడ విశేషం.

    గూగుల్ సిఈవో లారీ పేజిని ప్రపంచ వ్యాప్తంగా 742,500 మంది ఫాలోవర్స్ ఫాలో అవుతుండగా, పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్‌ని మాత్రం రికార్డు స్దాయిలో 743,000 మంది ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. గూగుల్ ప్లస్‌ని గూగుల్ కంపెనీ జులైలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా బ్రిట్నీ స్పియర్స్‌ యొక్క ట్విట్టర్ ఎకౌంట్‌ని కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఫాలో అవడం జరుగుతుంది.

    ఇప్పటి వరకు ట్విట్టర్ ఎకౌంట్లో లేడిగాగా, జస్టిన్ బైబర్, క్యాటి పెర్రీ, కిమ్ కర్దాషియాన్ మొదటి నాలుగు స్ధానాలను ఆక్రమించగా, పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ 11.3 మిలియన్ ఫాలోవర్స్‌తో ఐదవ స్దానంలో ఉన్నారు. 11.3 మిలియన్ ఫాలోవర్స్ బ్రిట్నీ స్పియర్స్ ట్విట్టర్ ఎకౌంట్‌ని అభిమానులు ఫాలో అవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ఇటీవలే గూగుల్ ప్లస్‌లో చేరిన విషయం తెలిసిందే.

    English summary
    Pop star Britney Spears has become the most followed individual on Google Plus with over 743,000 followers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X