అయ్యబాబోయ్ ఆవిడ సంతకం దొరకాలంటే చాలా కష్టం..!!
ప్రముఖ పాప్ (వివాదాల) తార బ్రిట్నీ స్పియర్స్ ఎంతో అందంగా ఉంటుంది. ఇక ఆమె పాటలు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 'హిట్ మీ బేబీ వన్ మోర్ టైమ్' అన్నా, 'ఊప్స్ ఐ డిడ్ ఇట్ ఎగెయిన్' అని అన్నా జనాలు ఎగబడిమరీ ఆమె పాటలను హిట్ చేసారు. దీంతో ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు. కానీ ఆమె మాత్రం తన అభిమానులకు ఆమడదూరంలో వుంటుంది. ఆమె అందానికి ముగ్ధులయి, సంతకం(ఆటోగ్రాఫ్) కోరదామంటే ఆమె కనిపించేదే అరుదు. ఒక వేళ కనిపించినా ప్రయివేట్ సెక్యూరిటీ సాయం లేనిదే అడుగు బయటపెట్టదు. దీంతో ఆమె అభిమానులకు ఆమె ఆటోగ్రాఫ్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది.
ఇప్పుడీ సోదంతా ఎందుకు అనుకుంటున్నారా..?? ఏంలేదండీ గత 2009 సంవత్సరానికి గాను ఏ సెలబ్రిటీ అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి అందుబాటులో వుంటారు, ఎవరు ఉండరు అని ఓ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ పాప్ తార అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి అందుబాటులో వుండని వారిలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఎల్టన్ జాన్, యు2, స్టిఫెన్ కింగ్, మెటాల్లికా లు నిలిచారు.
కాగా ఏ సెలబ్రిటీ అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి అందుబాటులో వుంటారు అనే సర్వేలో జార్జి క్లోనీ టాప్ ప్లేస్ లో నిలువగా, ది జోనస్ బ్రదర్స్, మైఖేల్ జోర్డాన్ లు ఆ తర్వాతి స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications











