బ్రిట్నీ స్పియర్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో వైరల్
గ్రామీ అవార్డ్ విన్నర్, యూఎస్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ అమెరికాలోని మేరీలాండ్‌లో నిర్వహించిన తన సెకండ్ పీస్ ఆప్ మి కాన్సెర్టులో డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఆమె డాన్స్ చేస్తుండగా దుస్తులు జారిపోయి కాస్త ఇబ్బంది పడింది. వెంటనే వాటిని సరి చేసుకుని తన షోను కంటిన్యూ చేసింది.

పీస్ ఆప్ మి కాన్సెర్టులో భాగంగా బిజిఎం నేషనల్ హార్బర్‌లోని థియేటర్లో 'డూ సంథిన్' అనే పాటకు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు డైలీ మెయిల్ పత్రిక పేర్కొంది.
కాగా.. బ్రిట్నీ స్పియర్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ అయింది. 36 ఏళ్ల వయసులోనూ బ్రిట్నీ స్పియర్స్ ఏమాత్రం జోరు తగ్గకుండా తనదైన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.
ఒకప్పుడు పాప్ సంగీత ప్రపంచాన్ని ఏలిన రారాణిగా బ్రిట్నీ స్పీయర్స్ ప్రపంచ వ్యాప్తంగా నీరాజనాలందుకున్నారు. ఇపుడు ఆమె హవా కాస్త తగ్గినా... ఆమెను అభిమానించే వారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన బిట్నీ స్పీయర్స్ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











