లాడెన్ కన్నా బ్రిట్నీ గురించే చాలా మంది వెతికారట...!!
ఏంటీ అమెరికాను గజగజ వణికించిన ఒసామా బిన్ లాడెన్ కన్నా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ను ఎక్కువ మంది వెతకడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా...?? వినడానికిది కొంత ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. కానీ ఇది ఇంటర్నెట్ వరకే పరిమితం లెండి. లండన్ లో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ దశాబ్దంలో ఇంటర్నెట్ లో అత్యధిక మంది వెతికిన పేరుగా బ్రిట్నీ స్పియర్స్ నిలిచింది.
ఆ తర్వాతి స్థానంలో ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ నిలవడం గమనార్హం. ఇక మూడో స్థానంలో ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్ హాం నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ప్రిన్సెస్ డయానా నిలిచింది. ఐదవ స్థానంలో యురాక్ మీద యుద్ధం లో అమెరికాకు సహకరించి విమర్శల పాలయిన యుకె మాజీ ప్రధాని టోనీ బ్రెయిర్ నిలిచారు. గత దశాబ్దంలో అత్యధికులు వెతికిన పేర్లలో టాప్-10 పేర్ల వివరాలు ఈ విధంగా వున్నాయి.
1. బ్రిట్నీ స్పియర్స్
2. ఒసామా బిన్ లాడెన్
3. డేవిడ్ బెక్ హాం
4. ప్రిన్సెస్ డయానా
5. టోనీ బ్లెయిర్
6. మడోన్నా
7. సిమానే కోవెల్
8. జేడ్ గూఢీ
9. మెడిలెయిడ్ మెక్ క్యాన్
10. బ్రాడ్ పిట్


Click it and Unblock the Notifications











