బ్రిట్నీ స్పియర్స్ కూడా వారికి దొరికిపోయింది..!!
ప్రపంచంలో ఎక్కడున్నా ఎప్పుడైనా అందరినీ కలిపివుంచే సాధనం ఏంటి అని చిన్నపిల్లాన్ని అడిగినా టక్కున ఇంటర్నెట్ అని చెప్పేస్తాడు. అంతగా ప్రజలని ప్రభావితం చేస్తోంది ఈ ఇంటర్నెట్. ప్రఫంచం మొత్తాన్ని ఓ విలేజ్ లా మార్చేసిన ఘనత ఇంటర్నెట్ ది అంటే కాదని అనలేము. ఇలా రోజురోజుకీ విస్తరిస్తున్న ఇంటర్నెట్ కు పోటీగా వెబ్ నేరాలు విస్తరిస్తున్నాయి. ఇన్నాళ్లు హాట్ తారల ఫోటోలతో వైరస్ ను సరఫరా చెయ్యడమే చూసాము. తాజాగా సెలబ్రటీల ట్వటర్ అకౌంట్లు హ్యాక్ చెయ్యడం లాంటివి జరుగుతున్నాయి.
ఈ వెబ్ నేరగాళ్ల చేతికి పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కూడా దొరికారు. ఆమె తన అభిమానులతో కలసిముచ్చటించేందుకు ఎంతో ముచ్చటపడి ట్విటర్ అకౌంట్ తీసుకోగా దాన్ని వెబ్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఆమె పేరిట కొన్ని మెసేజ్ లను పెట్టారంట. ఇందులో ఆమె దెయ్యాలను ఆరాధిస్తుందని రాయడం జరిగింది. దాన్ని చూసి ఖంగుతినడం బ్రిట్నీ వంతయింది. ఈ పరిణామాలకు షాక్ తిన్న బ్రిట్నీ వెంటనే తన అకౌంట్ ను హ్యాకర్ల నుండీ సురక్షితం చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తోందట.


Click it and Unblock the Notifications











