కొత్త ప్రియుడితో మీడియా కంటపడ్డ సెక్సీలేడీ (ఫోటో)
కాలిఫోర్నియా: హాలీవుడ్ పాప్ సింగ్ బ్రిట్నీ స్పియర్స్ మరో కొత్త బాయ్ ఫ్రెండుతో జతకట్టి మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారింది. తాజాగా ఆమె తన కొత్త ప్రియుడు డేవిడ్ లుకాడోతో కలిసి మీడియా కంట పడింది. గత వాలంటైన్స్ డే నుంచి ఇద్దరు బాగా సన్నిహితులయ్యారని, ప్రస్తుతం కలిసి సహజీవనం చేస్తున్నారని టాక్.
తన కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి లోకానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఆమె శుక్రవారం కాలిఫోర్నియాలో థౌజండ్ ఓక్స్ ప్రాంతంలో అతని చేతి పట్టుకుని నవ్వుతూ తుల్లుతూ మీడియా కంట పడేలా కలియ తిరిగింది. ఇతనితో చాలా సంతోషంగా ఉన్నానని సిగ్నల్స్ పంపింది. మరి ఇతడితో బ్రిట్నీ బంధం ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.
ఇతని కంటే ముందు బ్రిట్నీ స్పియర్స్ తన మాజీ ఏజెంట్ జాసన్ ట్రావిక్‌తో సహజీవనం చేసింది. అతన్నితో పెళ్లికి కూడా సిద్ధమైంది. ఏమైందో ఏమో కానీ అది ఆచరణకు నోచుకోలేదు. 31 సంవత్సరాల వయసు కలిగిన బ్రిట్ని స్పియర్స్ అంతకు ముందు తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ని చేసుకోగా.. ఆ తర్వాత డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరి నుండి స్పియర్స్ విడిపోయారు.
డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌తో కలిసి సంసారం చేసినప్పుడు బ్రిట్నీ స్పియర్స్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. సీన్ ఫ్రెస్టన్ వయసు 7 సంవత్సరాలు కాగా.. జేడన్ జేమ్స్ వయసు 6 సంవత్సరాలు. మరీ డేవిడ్ లుకాడోతో బ్రిట్నీ స్పియర్స్ ఎంత కాలంగా కలిసి ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











