ఏంజిలీనా జోలీని అధిగమించి ఉత్తమ తల్లిగా నిలిచిన బ్రిట్నీ స్పియర్
క్రిస్మస్ సేవింగ్స్ కంపెనీ పార్క్ నిర్వహించిన సర్వేలో పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్ ఉత్తమ తల్లిగా నిలిచిందని ది మిర్రర్ పత్రిక వెల్లడించింది. ఏడు వేల మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాని విడుదల చేసారుట. ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ఎప్పుడూ ఏదో ఓ వార్తతో లైమ్ లైట్ లోవుండే ఈ పాప్ సింగర్ ఇప్పుడీ వార్తతో మరో సారి వార్తల్లో నిలిచింది. 2008లో తన ప్రవర్తనతో తన పిల్లలను తన కష్టడీ నుండీ కోల్పోయిన ఈ తార తన సత్ప్రవర్తనతో కోర్టును మెప్పించి తిరిగి వారిని తన సొంతం చేసుకొంది. ఈ జాబితాలో క్రష్టినా రెండవ స్థానంలోనూ, ఆరుగురు పిల్లలకు తన మాతృత్వం పంచుతున్న ఏంజలీనా జోలీ మూడవ స్థానంలో నిలిచారు. 'బిగ్ బ్రదర్స్' రియాలిటీ షో ద్వారా అందరికీ సుపరిచయమైన దివంగత జేడ్ గూడీ నాల్గవ స్థానంలోనూ, టామ్ క్రూజ్ ను వివాహమాడిన క్యాటీ హాల్మస్ ఐదవ స్థానంలోనూ, మరో పాప్ సింగర్ మడోన్నా ఆరవ స్థానంలో నిలిచారు. ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్ హాం భార్య, సింగర్ విక్టోరియా బెక్ హాం పదవ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











